Ramabanam OTT: హీరో గోపీచంద్ తాజాగా నటించిన రామబాణం సినిమా థియేటర్లలో రిలీజ్ అయినా సంగతి తెలిసిందే.గోపీచంద్ కు బాగా అచ్చొచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించటంతో,అలాగే ఫామిలీ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమా మీద ప్రేక్షకులలో భారీగానే అంచనాలు నెలకొన్నాయి.కానీ ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయినా తర్వాత ఈ సినిమాకు నెగటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు అంతగా ఇంటరెస్ట్ చూపించలేదు.
దాంతో ఈ సినిమా ఓటిటీ డేట్ కూడా ఫిక్స్ అయ్యింది.తెలుగు సినిమాలు చాల వరకు థియేటర్లలో రిలీజ్ అయినా మూడు నాలుగు వారాలలోనే ఓటిటీ లో రిలీజ్ అవ్వడంతో గతంతో పోలిస్తే ఓటిటీ మీద ప్రేక్షకులలో బాగా ఆసక్తి పెరిగింది.ఇటీవలే దసరా,రావణాసుర,శాకుంతలం వంటి సినిమాలు మూడు నాలుగు వారాలలోనే ఓటిటీ లో రిలీజ్ అవ్వడం జరిగింది.
ఈ క్రమంలోనే రామబాణం సినిమాను కూడా రిలీజ్ అయినా నాలుగు వారాలకే ఓటిటీ లోకి తీసుకురావాలని ఫిక్స్ అయినట్టు సమాచారం.ఈ సినిమా ఓటిటీ హక్కులని దక్కించుకున్న సోనీ లివ్ ఈ సినిమాను జూన్ 1 లేదా 3 వ తేదీన ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది.