సినిమా ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ అయినా మొదట్లో విలన్ గా చేసి ఆ తర్వాత హీరోగా మారిన వాళ్లలో గోపీచంద్ కూడా ఒకరు అని చెప్పచ్చు.నితిన్ హీరోగా తెరకెక్కిన జయం,మహేష్ బాబు హీరోగా చేసిన నిజం సినిమాలలో గోపీచంద్ విలన్ గా చేసిన సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ రెండు సినిమాలు కూడా గోపీచంద్ కు నటుడిగా మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయి.ఆ తర్వాత ప్రభాస్ హీరోగా తెరకెక్కిన వర్షం చిత్రంలో కూడా గోపీచంద్ విలన్ గా నటించారు.
వర్షం చిత్రంలో గోపీచంద్ విలన్ పాత్ర హైలైట్ అని చెప్పచ్చు.ఆ తర్వాత గోపీచంద్ హీరోగా చేసి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు.త్వరలో గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన పక్క కమర్షియల్ అనే చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు.దర్శకునిగా వరుసగా విజయాలు అందుకుంటున్న మారుతి ఈ సినిమాతో కూడా విజయం అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగం గా మాట్లాడిన హీరో గోపీచంద్ ప్రభాస్ అడిగితె ఏ పాత్ర అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు.హీరో ప్రభాస్ కోరితే కథ గురించి పాత్ర గురించి కూడా అడగనని విలన్ గా చేయడానికి అయినా ఓకే అని గోపీచంద్ చెప్పుకొచ్చారు.రియల్ లైఫ్ లో వీరిద్దరూ మంచి స్నేహితులు అన్న సంగతి అందరికి తెలిసిందే.మరి వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తుందో లేదో వేచి చూడాల్సిందే.