Varun Tej -Lavanya Tripathi: ఈ రోజు నవంబర్ 1 న టాలీవుడ్ ప్రేమ జంట వరుణ్,లావణ్య మధ్యాహ్నం ఇటలీ లో వివాహం తో ఒక్కటైనా సంగతి తెలిసిందే.ఇక ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన హల్దీ,మెహందీ,సంగీత్ ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.వీరిద్దరి పెళ్లి వేడుకలో మెగా స్టార్ చిరంజీవి దంపతులు,రామ్ చరణ్ ఉపాసన దంపతులు,అల్లు అర్జున్ ,స్నేహ రెడ్డి దంపతులు,నితిన్ దంపతులు,సాయి ధరమ్ తేజ్,అల్లు శిరీష్ ఎంతో ఉత్సాహంగా సందడి చేసారు.
వరుణ్,లావణ్య కుటుంబసభ్యులు మరియు పలువురు సినీ ప్రముఖులు,అత్యంత సన్నిహిట్లు మధ్య వీరి వివాహం ఎంతో ఘనంగా జరిగింది.అక్టోబర్ 30 న కాక్ టైల్ పార్టీ తో షురూ అయినా వీరి పెళ్లి సెలెబ్రేషన్స్ ఈ రోజు పెళ్లి తో ఒక్కటి కాబోతున్నారు.తాజాగా వరుణ్ తేజ్ వరుడి గెటప్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన వీడియొ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
Also Read : వరుణ్,లావణ్య మెహందీ ఫంక్షన్ లో సందడి చేసిన అల్లు అర్జున్ ఫ్యామిలీ,నితిన్ ఫ్యామిలీ…ఫోటోలు వైరల్
గత మూడు రోజుల నుంచి మెగా ఇంట్లో పెళ్లి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.ఇటలీ లోని టాస్కాని లో వరుణ్,లావణ్య పెళ్లి గ్రాండ్ గ జరగనుంది.ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియొ లో వరుణ్ తేజ్ వరుడి గా ముస్తాబయ్యి తెల్లటి కన్వర్టిబుల్ కారులో వివాహ గమ్య స్థానానికి వచ్చినట్లు తెలుస్తుంది.ప్రముఖ డిసైనర్ మనీష్ మల్హోత్రా డిసైన్ చేసిన క్రీం గోల్డ్ కలర్ షేర్వాణీలో వరుణ్ తేజ్ కనిపించారు.వరుణ్ తో పాటు అతని కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు కూడా పెళ్లి జరిగే చోటుకి చేరుకున్నారు.
View this post on Instagram