ఈ మధ్యకాలంలో ఈ ఉరుకులు పరుగుల జీవితంలో వయస్సుతో సంబంధం లేకుండా చాల మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు.డబ్బులు సంపాదించాలి అనే ఆలోచనలో పడి చాల మంది తమ ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు.ఇప్పుడు ఉన్న పని వత్తిడి కారణంగానో లేక మారుతున్నా ఆహార అలవాట్లకు గానో చాల మందికి చిన్న వయస్సులో గుండెపోటు వచ్చిందనే సంఘటనలు చాలానే వింటున్నాము.ఇలా జీవిన శైలి మారిపోవడంతో చాల మంది అతి చిన్న వయస్సులోనే గుండెపోటుకు గురవుతున్నారు.
అయితే చాల మందికి గుండెపోటు లక్షణాలు ఏంటి అనేది తెలియదు.దింతో అపోహలకు గురి అయ్యి శరీరంలో ఏ చిన్న మార్పు కనిపించిన కూడా గుండెపోటు ఏమో అని కంగారు పడుతుంటారు.ఈ మధ్యకాలంలో గుండెపోటు అనేది చాల మందికి భయానికి గురి చేస్తున్న సమస్య.ఛాతిలో మంటగా అనిపించినా కూడా గుండెపోటు రాబోతుందేమో అని కంగారుపడతారు చాల మంది.చాల మందిలో గుండెపోతూ రాబోయే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు.ఛాతిలో నొప్పి,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు.
అలాగే ఏదైనా చిన్న పని చేసిన కూడా నిరాశపడిపోవడం మరియు కొద్దిసేపు నడిచిన ఎక్కువగా ఆయాసం రావడం వంటివి కూడా కొన్ని కొన్ని సార్లు గుండెపోటు వచ్చే ముందు లక్షణాలు అని చెప్తున్నారు నిపుణులు.అలాగే కొంతమందిలో జీర్ణయాస పై భాగంలో నొప్పిగా ఉండడం మరియు దవడ,మెడ భాగంలో నొప్పి ఉండడం వంటివి కూడా గుండెపోటు వచ్చే ముందు లక్షణాలు అని చెప్తున్నారు.రెండు రోజుల కంటే ఎక్కువగా కుడి చేయి కానీ ఎడమ చేయి కానీ లేదా రెండు చేతులు కానీ నొప్పిగా ఉన్నట్లయితే అది కూడా గుండెపోటుకు ముందు వచ్చే లక్షణంగా భావించాలి అని నిపుణులు చెప్తున్నారు.వీటిలో ఏ లక్షణం కనిపించిన కూడా వెంటనే వైద్యులను సంప్రదించడం మేలు అని తెలిపారు.