Guntur Kaaram OTT: తొలగించిన ఆ రెండు సీన్లను యాడ్ చేస్తూ ఓటిటీ లో గుంటూరు కారం…ఎప్పుడంటే

NEWS DESK
1 Min Read
Guntur Kaaram OTT

Guntur Kaaram OTT: త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సినిమా గుంటూరు కారం.జనవరి 12 న ఈ సినిమా భారీ అంచనాలతో థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక అనుకున్నట్లుగానే సినిమా రిలీజ్ అయినా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ ల వర్షం కురిపించింది గుంటూరు కారం.

Guntur Kaaram OTT
Guntur Kaaram OTT

మహేష్ బాబు సినిమా కెరీర్ లో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాలలో ఒకటిగా గుంటూరు కారం సినిమా నిలిచింది.ఇప్పటి వరకు ఈ సినిమా 240 కోట్ల గ్రాస్ ను,122 కోట్ల షేర్స్ ను రాబట్టింది.తాజాగా గుంటూరు కారం సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియా లో బాగా వినిపిస్తుంది.

Also read : కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ మూసివేత…అండగా ఉంటానంటున్న హీరో సందీప్ కిషన్

Guntur Kaaram OTT
Guntur Kaaram OTT

ఫిబ్రవరి 9 నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఇప్పటికే చాల వార్తలు వినిపించాయి.159 నిమిషాల నిడివితో గుంటూరు కారం సినిమా థియేటర్ లలో రిలీజ్ అయ్యింది.అయితే ఈ సినిమా ఓటిటీ వెర్షన్ లో కొత్త సీన్లు కూడా యాడ్ చేయనున్నట్లు సమాచారం.ఈ సినిమా రన్ టైం ఎక్కువ ఉండటం తో అమ్మ పాటతో పాటు కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే యాక్షన్ సీన్ ను మూవీ మేకర్స్ కట్ చేయడం జరిగింది.అయితే ఈ సినిమా ఓటిటీ స్ట్రీమింగ్ లో తొలగించిన కొన్ని సీన్లను యాడ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *