పుష్ప రాజ్ ను ఇమిటేట్ చేసిన హన్సిక….వీడియొ వైరల్…

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ పుష్ప ది రైస్ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమాలో అల్లు అర్జున్ మునుపెన్నడూ కనిపించని ఊర మాస్ లుక్ లో కనిపించి అందరిని ఆకట్టుకున్నాడు.పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా అందరిని మెస్మరైస్ చేసారు.పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ ను తప్ప మరొక హీరోను ఉహించుకోలేము అన్నంతగా తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు.

యెర్ర చందనం నేపథ్యంలో ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ రెండు భాగాలలో తెరకెక్కించనున్నారు.పుష్ప మొదటి భాగం బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో రెండవ భాగం మీద ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రంలో అల్లు అర్జున్ మ్యానరిజం కు రెస్పాన్స్ ఓ రేంజ్ లో వచ్చిందన్న విషయం అందరికి తెలిసిందే.

చాల మంది సెలెబ్రెటీలు ఈ మ్యానరిజం తో వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.అయితే తాజాగా స్టార్ హీరోయిన్ హన్సిక కూడా ఇదే మ్యానరిజం తో ఒక వీడియొ ను షేర్ చేయడం జరిగింది.హన్సిక అల్లు అర్జున్ కు జోడిగా దేశముదురు అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.హన్సిక కు అల్లు అర్జున్ అంటే విపరీతమైన అభిమానం.అప్పట్లో వీరిద్దరూ కాంబినేషన్ లో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన దేశముదురు చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *