హలో బ్రదర్ సినిమాలో నాగార్జునకు డూప్ గా నటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా…


అక్కినేని నాగార్జున కెరీర్ లో చాల హిట్ సినిమాలు ఉన్నాయి.అందులో హలో బ్రదర్ సినిమాకు ప్రత్యేక స్తానం ఉండనే చెప్పచ్చు.ఇ వి వి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున మొదటి సరిగా డ్యూయల్ రోల్ లో కనిపించటం జరిగింది.ఈ సినిమాలో నాగార్జున రెండు విభిన్న పాత్రలలో నటించారు.అప్పట్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఒకసారి బిగ్ బాస్ షో వేదికగా నాగార్జున హలో బ్రదర్ సినిమాలో తనకు డూప్ గా నటించింది ఎవరు అనే దాని గురించి చెప్పడం జరిగింది.ఈ సినిమాలో రెండు సీన్లలో కనిపించే సన్నివేశాలలో స్టార్ హీరో శ్రీకాంత్ నాగార్జునకు డూప్ గా నటించారట.

ఈ విషయం స్వయంగా నాగార్జున గారు బిగ్ బాస్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ఇ వి వి సత్యనారాయణ తెరకెక్కించిన వారసుడు చిత్రంలో నాగార్జున తో కలిసి శ్రీకాంత్ నటించటం జరిగింది.ఇ వి వి సత్యనారాణ గారితో హీరో శ్రీకాంత్ మంచి అనుబంధం ఉండనే చెప్పచ్చు.హలో బ్రదర్ చిత్రంలో నాగార్జున ఇద్దరుగా కనిపించే సన్నివేశాలలో శ్రీకాంత్ నాగార్జున కు డూప్ గా నటించారు.నాగార్జున మరియు శ్రీకాంత్ ఒకే హైట్ మరియు ఒకే పర్సనాలిటీ ఉండటంతో ఇ వి వి సత్యనారాణ గారు శ్రీకాంత్ కు హలో బ్రదర్ సినిమాలో నాగార్జున కు డూప్ గా నటించే అవకాశం ఇచ్చారు.

హీరో శ్రీకాంత్ నాగార్జున గారి తో వారసుడు,ప్రెసిడెంట్ గారి పెళ్ళాం,నిన్నే ప్రేమిస్తా వంటి చిత్రాలలో కలిసి నటించారు.హలో బ్రదర్ సినిమా తర్వాత నాగార్జున ఎదురు లేని మనిషి,సోగ్గాడే చిన్ని నాయన,బంగార్రాజు సినిమాలలో డ్యూయల్ పాత్రలలో కనిపించారు.శ్రీ దుర్గ ఆర్ట్స్ పతాకంపై కె యల్ నారాయణ హలో బ్రదర్ చిత్రాన్ని నిర్మించారు.సూపర్ హిట్ అయినా ఈ చిత్రంలో నాగార్జున సరసన రమ్య కృష్ణ,సౌందర్య హీరోయిన్లుగా నటించారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *