Namrata Shirodkar: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు అంటే తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు.ఆయన గురించి ప్రేక్షకులకు ప్రేత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఆయన ప్రొడక్షన్ తో పాటు ఇతర వ్యాపారాలలో కూడా ఇన్వెస్ట్ చేయడం అందరికి తెలిసిందే.ఇటీవలే హీరో మహేష్ బాబు భార్య నమ్రత ఒక కొత్త కాఫీ షాప్ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది.ప్రస్తుతం ఆ హోటల్ లో ఉన్న రేట్లు చూసి అందరు షాక్ అవుతున్నారని చెప్పచ్చు.ఈ క్రమంలోనే ఈ విషయం గురించి నెట్టింట్లో బాగా ట్రోల్ జరుగుతున్నాయి.హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ దగ్గర హీరో మహేష్ బాబు భార్య నమ్రత కొత్త పాలస్ హైట్స్ లలో మినర్వా అనే కాఫీ షాప్ ప్రారంభించడం జరిగింది.పూజ కార్యక్రమాలతో హీరోయిన్ నమ్రత ఈ కాఫీ షాప్ ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇది పేరుకు మాత్రమే కాఫీ షాప్ కానీ ఇందులో స్నాక్స్ తో పాటు చైనీస్ ఫుడ్స్ మరియు వివిధ రకాల ఐటమ్స్ అందుబాటులో ఉంటాయని సమాచారం.టిఫిన్స్ కూడా ఇక్కడ లభిస్తాయట.హై ఏరియా లో ఈ హోటల్ ప్రారంభించడం వలన ఐటమ్స్ రేట్లు కూడా ఆ ఏరియా కు తగ్గట్లుగా ఉన్నాయని తెలుస్తుంది.సాధారణ టిఫిన్లు ఊహించని రేంజ్ లో ఉన్నాయని సమాచారం.
ఇక్కడ సాధారణ ఇడ్లి లు ఒక ప్లేట్ రూ.90 రూపాయలు ఉంటె వివిధ రకాల ఇడ్లిలు రూ.120 నుంచి రూ.190 రూపాయలు ఉన్నాయని సమాచారం.స్టార్టర్స్ 390 రేంజ్ లో ఉన్నాయని చెప్తున్నారు.పునుగులు,ఆలు బజ్జిలు,మిర్చి బజ్జిలు వంటివి 125 ఉన్నట్లు చెప్తున్నారు.రిచ్ కిడ్స్ కు మాత్రమే ఈ షాప్ సరిపోతుందని సోషల్ మీడియాలో కొంత మంది నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.మరోపక్క కొంత మంది మాత్రం మెయిన్ సిటీ లో ఉన్న ఎన్నో రెస్టారెంట్స్ లో ఇది కూడా ఒకటి అందుకే ఇందులో రేట్లు హై రేంజ్ లో ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.