ఈ ఫొటోలోని చిన్నారి ప్రస్తుతం స్టార్ హీరో సతీమణి…పలు సేవాకార్యక్రమాలతో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈమె ఎవరో తెలుసా!

Upasana Kamineni Konidela childhood pics

Upasana Kamineni Konidela: ఈ ఫొటోలో క్యూట్ గా ఉన్న చిన్నారి ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో సతీమణి.ఈమె పుట్టినిల్లు,మెట్టినిల్లు రెండు కూడా బడా ఫ్యామిలీలే.అయితే ఈమె తన సేవ కార్యక్రమాలతో తన మంచి మనస్సుతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.మూగజీవాలపై ఈమెకు ఉన్న అమితమైన ప్రేమతో వాటి సంరక్షణ కోసం కాంపెయిన్లు,పలు కార్యక్రమాలను ఎప్పుడు చేస్తూ ఉంటారు.

ప్రముఖ వ్యాపారవేత్త మానవరాలిగా బిజినెస్ వ్యవహారాలు కూడా చూసుకుంటూ సక్సెస్ ఫుల్ బిజినెస్ వుమన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.పలు సేవాకార్యక్రమాలతో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈమె ఎవరో కాదు మెగా కోడలు,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి అయినా కొణిదెల ఉపాసన.ఈమె ప్రముఖ వ్యాపారవేత్త అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ అయినా డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనవరాలు.ఈమె అతి చిన్న వయస్సులోనే బిజినెస్ రంగంలో అడుగుపెట్టారు.అపోలో హెల్త్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ గా కొణిదెల ఉపాసన పలు సామజిక ప్రాయోజిక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది.

Upasana Kamineni Konidela Childhood Pics

యు ఎక్స్చేంజి అనే సేవ సంస్థను స్థాపించి పాత పుస్తకాలను సేకరించి వాటిని పేద పిల్లలకు అందించేవారు.మురికి వాడాలో అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు అపోలో హెల్త్ సిటీ లో మెరుగైన చికిత్స అందించడానికి కృషి చేసారు ఉపాసన.చిరంజీవి గారి ఇంట్లో మెగా కోడలిగా అడుగుపెట్టి అందరి అభిమానాలను గెలుచుకున్నారు.రాంచరణ్ సతీమణిగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ అన్ని విధాలుగా అండగా నిలిచారు.ప్రస్తుతం ఏడు నెలల గర్భంతో ఉన్న ఉపాసన గారు త్వరలోనే తల్లిగా ప్రమోషన్ పొందుతున్నారు.మెగా కుటుంబసభ్యులతో పాటు అభిమానులు కూడా మెగా వారసుడు/వారసురాలి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *