తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ హీరోగా పేరుతెచ్చుకున్న హీరో రామ్ పోతినేని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.క్లాస్ సినిమాలతో పాటు మాస్ సినిమాలు కూడా చేస్తూ భిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు రామ్ పోతినేని.ఇప్పటి వరకు రామ్ కెరీర్ లో హిట్ సినిమాలతో పాటు ప్లాప్ లు కూడా ఉన్నాయి.అయితే రామ్ వై వి ఎస్ చౌదరి దర్శకత్వం వహించిన దేవదాసు అనే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు.
2006 లో రిలీజ్ అయినా ఈ చిత్రం లో రామ్ కు జోడిగా ఇలియానా హీరోయిన్ గా నటించడం జరిగింది.ఈ సినిమాలో నటించి నప్పుడు రామ్ వయస్సు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే.అయితే ఈ సినిమా కంటే ముందు రామ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక సినిమా లో నటించారు అన్న సంగతి చాల మంది ప్రేక్షకులకు తెలియదు.

అయితే రామ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది తెలుగు సినిమాలో కాదు.ఒక తమిళ్ షార్ట్ సినిమాలో రామ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం జరిగింది.ఆదాయాలం అనే ఒక తమిళ్ షార్ట్ సినిమాలో రామ్ పోతినేని చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.ఈ చిత్రానికి గాను రామ్ కు బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా లభించింది.ఈ సినిమాలో నటించేటప్పుడు రామ్ వయస్సు 11 సంవత్సరాలు.అయితే ఇటీవలే జరిగిన ఒక పర్సనల్ ఇంటర్వ్యూ లో రామ్ పోతినేని తానూ చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళ్ సినిమాలో నటించాను అన్న సంగతి చెప్పుకొచ్చారు.