Srikanth Family: ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న హీరోలలో హీరో శ్రీకాంత్ కూడా ఒకరు అని చెప్పచ్చు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మొదట్లో శ్రీకాంత్ క్యారక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే నెగటివ్ రోల్స్ లో కూడా కనిపించారు.ఆ తర్వాత హీరో గా చేసిన శ్రీకాంత్ మహిళా ప్రేక్షకుల మద్దతుతో భారీ స్థాయిలో విజయాలను అందుకున్నారు.
లవర్ బాయ్ ఇమేజ్ తో పాటు ఫ్యామిలీ హీరోగా కూడా ప్రేక్షకులలో క్రేజ్ ను సొంతం చేసుకున్నారు శ్రీకాంత్.శ్రీకాంత్ ఊహతో కలిసి నటించిన తొలి సినిమాలోనే ఆమెతో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.ఊహ కూడా పలు తెలుగు సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరూ అన్యోన్యంగా ఉంటూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.తాజాగా శ్రీకాంత్ ఊహ తమ 25 వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు.ఈ క్రమంలోనే ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ప్లేట్ ఫారం లలో వైరల్ అవుతున్నాయి.
ఇక శ్రీకాంత్ కొడుకు రోషన్ నిర్మల కాన్వెంట్ సినిమా తో హీరో గా తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయినా సంగతి అందరికి తెలిసిందే.తాజాగా రోషన్ కె రాఘవేంద్ర రావు దర్శకత్వం లో చేసిన పెళ్లి సందడి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఒక వైపు చదువుకుంటూనే మరో వైపు సినిమాలు చేస్తున్నాడు రోషన్.ఇక శ్రీకాంత్ కూడా హీరో గానే కాకుండా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కూడా సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు.ఇటీవలే శ్రీకాంత్ అఖండ సినిమా లో చేసిన నెగటివ్ రోల్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.నాగచైతన్య హీరోగా నటించిన యుద్ధం శరణం సినిమాలో పవర్ ఫుల్ నెగటివ్ రోల్ లో అలరించారు శ్రీకాంత్.బోయపాటి శ్రీను,అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సరైనోడు సినిమాలో పాజిటివ్ పాత్ర లో నటించిన శ్రీకాంత్ ఆ తర్వాత అఖండ సినిమాలో భిన్నంగా విలన్ పాత్ర లో అలరించారు.
View this post on Instagram