సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చే నటి నటుల జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము.కొంత మంది ఒక్క సినిమా హిట్ తోనే స్టార్ లుగా మారిపోతుంటారు.మరికొంత మంది కొన్ని సినిమాలు చేసిన తర్వాత కనుమరుగైపోతూ ఉంటారు.తెలుగు ప్రేక్షకులకు వేణు తొట్టెంపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఒక్కప్పుడు వరుస సినిమాలు చేస్తూ ఎన్నో హిట్స్ అందుకున్న వేణు ఇప్పుడు సినిమాలలో ఎక్కడ కనిపించటం లేదు.ఒకటి రెండు సినిమాలలో కనిపించిన ఆ పాత్రలకు పెద్దగా గుర్తింపు అయితే రాలేదు.ఒక్కప్పుడు తన సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయిన వేణు కెరీర్ ఇలా కావడానికి కారణం ఏంటి అనేది చాల మందికి తెలియదు.
తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి స్వయంవరం చిత్రంతో హీరోగా అడుగుపెట్టిన వేణు,తన నటనతో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులకు దగ్గరయ్యారు.ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు సక్సెస్ కాకపోవడంతో అవకాశాలు తగ్గిపోయాయి.ఆ తర్వాత వేణు తన భార్య తో కలిసి బిజినెస్ స్టార్ట్ చేసినట్టు సమాచారం.వేణు అనుపమ అనే అమ్మాయిని 2001 లో పెళ్లి చేసుకున్నారు.అనుపమ ఎంబీఏ పూర్తి చేసారు.ఏ కథ పడితే ఆ కథ ఎంచుకోవడం కారణంగా వేణు కెరీర్ ఇలా అయిపొయింది విశ్లేషకులు చెపుతున్నారు.

సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన వేణు మాస్ మహారాజ్ రవి తేజ హీరోగా తెరకెక్కుతున్న రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం.సాధారణంగా అయితే నటి నటులు అవకాశాలు ఇవ్వమని దర్శకులను,నిర్మాతలను అడుగుతుంటారు.కానీ వేణు మాత్రం అలా అవకాశాలు ఇవ్వమని అడగరట.తనను వెతుక్కుంటూ వచ్చిన అఫర్ ను మాత్రమే ఓకే చేస్తారట వేణు.ఇదే తనలో ఉన్న మైనస్ పాయింట్ అని వేణు సన్నిహితులు చెపుతూ ఉంటారు.