టాలీవుడ్ లో బిచ్చగాడు సినిమాతో ఘనవిజయం అందుకొని మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోనీ.ఆ సినిమాతో తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్న విజయ్ ఆ తర్వాత తన ప్రతి సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు విజయ్.అయితే విజయ్ తండ్రి మరణించేనాటికి విజయ్ వయస్సు కేవలం ఏడు సంవత్సరాలు.అప్పుడు తన చెల్లి వయస్సు నాలుగు సంవత్సరాలు.ఇక విజయ్ తల్లి ఉద్యోగం చేస్తూ పిల్లలను చూసుకునేవారు.ఉద్యోగం కోసం వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చిన కూడా తన పిల్లల చదువు గురించి అలోచించి అక్కడే ఉంది ఉద్యోగం కోసం దూర ప్రయాణం కూడా చేసేవారు.
ఇక విజయ్ లయోలా కాలేజి ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ లో చదువు కున్నారు.ఆ తర్వాత సౌండ్ ఇంజినీరింగ్ పూర్తి చేసారు.విజయ్ తల్లి ఉద్యోగ రీత్యా శిక్షణ తరగతులకు వెళ్లాల్సి వచ్చిన సమయంలో విజయ్ ను హాస్టల్ లో ఉంచి తనతో పాటు కూతురిని తీసుకెళ్లారు.
హాస్టల్ లో ఉన్న సమయంలో రెండు రోజులు సెలవులు రావడంతో వార్డెన్ సలహా మేరకు శ్రీలంక శరణార్ధుల శిబిరంలో తలదాచుకున్నని విజయ్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు.చేతిలో చిల్లిగవ్వ కూడా లేని సమయంలో అరటిపండు తింటూ జీవనం సాగించాను అని తానూ పడిన కష్టాల గురించి చెప్పుకొచ్చారు విజయ్.

ఇక సినిమాల మీద ఆసక్తి తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ నాన్ 2012 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఆ తర్వాత సలీమ్ సినిమాతో విజయ్ కు మంచి గుర్తింపు వచ్చింది.ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోయాడు విజయ్.ఆ టైం లో విజయ్ పెళ్లి కూడా సంచలనం సృష్టించింది అని చెప్పచ్చు.విజయ్ ను ఫాతిమా అనే ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు ఆమెను ప్రేమించి 2006 లో పెళ్లి చేసుకున్నారు.ఈ దంపతులకు లారా అనే కూతురు ఉంది.