తెలుగు సినిమా ప్రేక్షకులకు విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మంచి గుర్తింపు సాధించిన వాళ్లలో విజయ్ దేవరకొండ కూడా ఒకరు.ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను సొంతం చేసుకున్నారు.పూరీజగన్నాధ్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్ లో లైగర్ సినిమాలో నటిస్తున్నారు విజయ్ దేవరకొండ.ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పది సంవత్సరాలు అవుతున్న తన సినిమా కెరీర్ లో ఏకంగా తొమ్మిది సినిమాలను రిజెక్ట్ చేసారు.
అందులో అయిదు సినిమాలు బ్లాక్ బస్టర్ అవడం గమనార్హం.అయితే విజయ్ దేవరకొండ కొన్ని సినిమా కథలు నచ్చక రిజెక్ట్ చేస్తే మరికొన్ని డేట్స్ అడ్ జస్ట్ కుదరలేక రిజెక్ట్ చేసారు.ఇటీవలే వెంకీ కుడుముల దర్శకత్వంలో హీరో నితిన్ నటించిన సూపర్ హిట్ చిత్రం భీష్మ.ఈ సినిమాలో నటించే అవకాశం ముందుగా విజయ్ దేవరకొండ కు వచ్చింది.కానీ కథ నచ్చకపోవడంతో ఆయన రిజెక్ట్ చేసారు.అలాగే పూరీజగన్నాధ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన చిత్రం స్మార్ట్ శంకర్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఈ చిత్రాన్ని కూడా కథ నచ్చకపోవటం వలన విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేసారు.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కూడా విజయ్ దేవరకొండ కు ఒక కథను వినిపించారు.
ఆ కథ కూడా నచ్చకపోవడంతో ఆయన రిజెక్ట్ చేసారు.బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అయినా కరణ్ జోహార్ వి రెండు సినిమాలను విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేయడం జరిగింది.అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత కరణ్ జోహార్ విజయ్ దేవరకొండ ను బాలీవుడ్ కు పరిచయం చేయాలనీ చాల ప్రయత్నాలు చేసారు.కానీ అది కుదరలేదు.ఇంకా ఆర్ ఎక్స్ 100 ,బుచ్చిబాబు,ఉప్పెన వంటి చిత్రాల్లో నటించే అవకాశం కూడా ముందుగా ఆయనకే వచ్చింది.ఇలా ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ తన సినిమా కెరీర్ లో అయిదు బ్లాక్ బస్టర్ సినిమాలను రిజెక్ట్ చేసారు.