Home సినిమా కెజిఎఫ్ హిట్ తర్వాత భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన హీరో యశ్…ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

కెజిఎఫ్ హిట్ తర్వాత భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన హీరో యశ్…ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

0

కెజిఎఫ్ సినిమా మొదటి భాగం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే.ఈ చిత్రం హీరో యశ్ కు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చిపెట్టింది.అప్పటి వరకు కన్నడ స్టార్ హీరోగా ఉన్న యశ్ ను పాన్ ఇండియా హీరోగా క్రేజ్ తెచ్చిపెట్టింది కెజిఎఫ్ చిత్రం.ఆ తర్వాత కెజిఎఫ్ కు  సీక్వెల్ గా వచ్చిన కెజిఎఫ్ 2 భారీ అంచనాలతో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఈ రెండు చిత్రాలు సంచలన విజయాలు సాధించడంతో యశ్ తో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కట్టారు.హీరో యశ్ కెజిఎఫ్ 2 చిత్రానికి 25 కోట్లు పారితోషకం తీసుకున్నట్టు సమాచారం.

తర్వాతి చిత్రాలకు యశ్ ఈ పారితోషకాన్ని రెట్టింపు పారితోషకం డిమాండ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.అయితే నిర్మాతలు సైతం యశ్ కు డిమాండ్ చేసినంత పారితోషకం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం.కెజిఎఫ్ చిత్రం తర్వాత యశ్ తర్వాతి చిత్రాలు కూడా హిట్ అయితే యశ్ కు భారీ పారితోషకం వచ్చే అవకాశం ఉంది.కెరీర్ లో ఆచి తూచి నిర్ణయం తీసుకుంటున్న యశ్ తర్వాతి సినిమాలు ఎలాంటి విజయం సాధిస్తాయో వేచి చూడాల్సిందే.ఈ చిత్రం హిందీలో దంగల్ సినిమా కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేయడం గమనార్హం.

yash remuneration

పాన్ ఇండియా సినిమాలకు మాత్రమే యశ్ ఓకే చెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు.హీరో యశ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కెజిఎఫ్ 3 తెరకెక్కాల్సి ఉన్న ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావలసి ఉందని సమాచారం.మరింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి.ఈ సినిమా చిత్రీకరణ విదేశాలలో జరగనుందని రాఖి భాయ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ గురించి ఈ చిత్రంలో చూపించనున్నారని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.మరి ఈ చిత్రం ఎంతటి విజయం సాధిస్తుందో వేచి చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here