గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి హీరోయిన్ ఆసిన్..ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా…

తెలుగు సినిమా ఇండస్ట్రీ కి అమ్మా నాన్న ఓ తమిళ్ అమ్మాయి సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు ఆసిన్.పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరో రవి తేజ కు జోడిగా నటించింది ఆసిన్.2003 లో రిలీజ్ అయినా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ చిత్రం అటు హీరో రవితేజ కు మరియు హీరోయిన్ ఆసిన్ కు మంచి క్రేజ్ తెచ్చి పెట్టింది.ఆసిన్ మలయాళి అమ్మాయి అయినా కూడా పూరి జగన్నాధ్ ఆసిన్ ను తమిళ అమ్మాయిగా చూపించడంలో సక్సెస్ అయ్యారు.ఇక ఆసిన్ మొదటి చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో హీరో నాగార్జున కు జోడిగా శివమణి చిత్రంలో నటించేందుకు అవకాశం ఇచ్చాడు పూరి జగన్నాధ్.

శివమణి చిత్రం కూడా సూపర్ హిట్ అవ్వడం జరిగింది.ఆ తర్వాత హీరో బాలకృష్ణ తో లక్ష్మి నరసింహ,వెంకటేష్ తో ఘర్షణ,పవన్ కళ్యాణ్ తో అన్నవరం,ప్రభాస్ తో చక్రం వంటి సినిమాలలో అవకాశం రావడంతో ఫుల్ బిజీగా అయిపొయింది ఆసిన్.తెలుగు తో పాటు తమిళ,హిందీ లో వరుస సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.సూర్య హీరోగా తెరకెక్కిన గజినీ సినిమాలో తన నటనకు ప్రశంసలు కూడా అందుకుంది ఆసిన్.

స్టార్ హీరోయిన్ గా కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయం లోనే రాహుల్ శర్మ అనే బిజినెస్ మ్యాన్ ను 2016 లో పెళ్లి చేసుకుంది.రాహుల్ శర్మ మైక్రో మ్యాక్స్ కంపెనీ కి సి.ఈ.ఓ అన్న సంగతి చాల మందికి తెలిసే ఉంటుంది.ఈ దంపతులకు ఒక పాప ఉంది.ఆసిన్ ఎటువంటి సోషల్ మీడియా అకౌంట్ ను మైంటైన్ చేయడం లేదు.ఇటీవలే ఆమెకు సంబంధించిన ఫ్యామిలీ ఫోటోలు కొన్ని సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.ఈ ఫోటోలలో ఆసిన్ గుర్తుపట్టలేనంతగా మారిపోవడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *