Anjali: తనకు కాబోయేవాడికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో చెప్పిన అంజలి…ఆమె కోరికలు మాములుగా లేవుగా

NEWS DESK
1 Min Read
heroine anjali said about his future husband qualities

Anjali: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే చాల హీరోయిన్ల పెళ్లి గురించి చాల వార్తలు వైరల్ అయ్యాయి.ప్రస్తుతం ఇదే క్రమంలో తెలుగు అమ్మాయి అయినా అంజలి పెళ్లి గురించి కూడా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.హీరోయిన్ అంజలి( Anjali ) అంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈమె తెలుగు అమ్మాయి అయినప్పటికీ కూడా తమిళ్ లో సినిమాలు చేసి మంచి క్రేజ్ ను ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.హీరోయిన్లు తమ సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలతో కూడా ఎల్లప్పుడూ చర్చల్లో ఉంటారు.షాపింగ్ మాల్ అనే డబ్బింగ్ తెలుగు సినిమాతో మొదటి సరిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అంజలి.ఆ తర్వాత జర్నీ సినిమాతో ఈమె మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.

ఆ తర్వాత మహేష్ బాబు,వెంకటేష్ నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఈమె స్పెషల్ సాంగ్స్ కూడా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈమె పెళ్లి గురించి పలు వార్తలు వినిపిస్తున్నాయి.గతంలో ఈమె యంగ్ హీరోతో ప్రేమాయణం నడిపింది అనే వార్తలు వినిపించాయి.ఆ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరి గురించి ఏ న్యూస్ బయటకు రాలేదు.తాజాగా అంజలి తనకు కాబోయే వాడికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈమె ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది.రిలేషన్ షిప్ లో ఒకరి పట్ల మరొకరికి మర్యాద చాల ముఖ్యమని..మర్యాద లేని వ్యక్తిని ఎప్పటికి ఒప్పుకోను అని చెప్పుకొచ్చింది అంజలి.అలంటి వ్యక్తితో సంబంధం పెట్టుకొను అంటూ తెలిపింది.కెరీర్,రిలేషన్ షిప్ రెండు కూడా నాకు ముఖ్యమే అంటూ చెప్పుకొచ్చింది అంజలి.

 

View this post on Instagram

 

A post shared by Actress Gallery (@actressgalleryc)

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *