రెండు జడలు వేసుకొని క్యూట్ గా నవ్వుతున్న ఈ ఫొటోలోని స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా…

సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తమ అందంతో నటనతో ప్రేక్షకులకు దగ్గరయిన హీరోయిన్లు చాల మందే ఉన్నారు.సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వాళ్లలో ఈ చిన్ననాటి ఫొటోలో ఉన్న చిన్నారి కూడా ఒకరు.అయితే ఈ మధ్య కాలంలో నటి నటుల,సెలెబ్రెటీల చిన్ననాటి ఫొటోలో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో దాదాపు చాల మంది నటి నటుల చిన్ననాటి ఫోటోలు ప్రతి రోజు కనిపిస్తుంటాయి.

ఇప్పుడు తాజాగా హీరోయిన్ ఛార్మి కి సంబంధించిన చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.2001 వ సంవత్సరంలో నీ తోడు కావాలి అనే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైనా హీరోయిన్ ఛార్మి.ఆ సినిమా తర్వాత తమిళ్ లో కాదల్ కిసు కిసు అనే చిత్రంలో నటించింది ఛార్మి.అతి చిన్న 14 ఏళ్ళ వయస్సులోనే ఛార్మి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత తెలుగులో నితిన్ హీరోగా తెరకెక్కిన శ్రీఆంజనేయం చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది ఛార్మి.

ఆ చిత్రం తర్వాత వరుస ఆఫర్ లతో బిజీ గా అయిపొయింది ఈ అమ్మడు.గౌరీ,చంటి,మాస్,చక్రం,అనుకోకుండా ఒక రోజు,పౌర్ణమి,స్టైల్,లక్ష్మి,లవకుశ,మంత్ర,సుందరకాండ,జ్యోతి లక్ష్మి వంటి పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.ప్రస్తుతం ఛార్మి పూరి జగన్నాధ్ దర్శకునితో కలిసి పూరి కనెట్స్ నిర్మాణ సంస్థ ప్రారంభించి నిర్మాతగా వ్యవహరిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *