సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి భాషతో సంబంధం లేకుండా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలా మంది సెలెబ్రెటీల చిన్ననాటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలో ఇప్పటి వరకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల చాల మంది చిన్ననాటి ఫోటోలు ప్రతి రోజు వైరల్ అవుతున్నాయి.ఆ చిన్ననాటి ఫొటోలో ఉన్న హీరోయిన్ ను గుర్తుపట్టడానికి ప్రేక్షకులు కూడా బాగా ఆసక్తి చూపిస్తున్నారు.
తాజాగా ఒక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.ఫొటోలో ఎంతో క్యూట్ గా ఉన్న ఈ చిన్నారి ఎవరో కాదు లక్ష్మీకళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైనా ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్.ఈ సినిమాలో కాజల్ హీరో కళ్యాణ్ రామ్ కు జోడిగా నటించింది.ఇక మొదటి సినిమాతోనే ఈ అమ్మడు తన అందంతో నటనతో ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది.

ఆ తర్వాత చందమామ బ్లాక్ బస్టర్ సినిమాతో మంచి క్రేజ్ ను దక్కించుకుంది కాజల్.చందమామ సినిమా తర్వాత కాజల్ కు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి.ఆ తర్వాత చాల హిట్ సినిమాలను తన సొంతం చేసుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది కాజల్.ఇటీవలే కాజల్ తన స్నేహితుడు అయినా గౌతమ్ కిచ్లు ను వివాహం చేసుకొని ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది.అయితే పెళ్లి చేసుకున్నాక కూడా కాజల్ క్రేజ్ ఏమాత్రం కూడా తగ్గలేదు అనే చెప్పచ్చు.టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు కాజల్ కు మంచి ఫాలోయింగ్ ఉంది.