Actress Laya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చక్కటి తెలుగు హీరోయిన్ అయినా లయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.1992 సంవత్సరం లో భద్రం కొడుకో అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యింది లయ.కానీ మొదటి సినిమా విజయం సాధించలేకపోయింది.ఆ తర్వాత హీరో వేణు కు జోడిగా స్వయంవరం అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది లయ.
స్వయంవరం సినిమా లయ( Laya ) కు హీరోయినిగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది దాంతో అందరు లయ మొదటి సినిమా స్వయంవరం అనే అనుకుంటారు.స్వయంవరం సినిమాలో తన అందంతో,నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది లయ.ఆ తర్వాత ప్రేమించు అనే సినిమాలో కళ్ళు లేని అమ్మాయిగా అద్భుతంగా నటించి ఉత్తమ నటిగా నంది అవార్డును సొంతం చేసుకుంది.

సినిమా ఇండస్ట్రీలోకి రాక ముందు లయ ఒక చెస్ ప్లేయర్.ఏడు సార్లు స్టేట్ లెవెల్ లో విజయం సాధించింది లయ.నేషనల్ లెవెల్ లో కూడా ఆమె చెస్ ఆడడం జరిగింది.లయ ఒక మంచి క్లాసికల్ డాన్సర్ కూడా.సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందు ఆమె 50 కు పైగా స్టేజి షోలలో పాల్గొనడం జరిగింది.ఇక లయ తెలుగులో మనసున్న మారాజు,మనోహరం,హనుమాన్ జంక్షన్,ని ప్రేమకై,మిస్సమ్మ,పెళ్ళంటా పనేంటి,దొంగరాముడు అండ్ పార్టీ,దేవుళ్ళు,కోదండరాముడు వంటి చిత్రాలలో నటించి అలరించింది.

ఆ తర్వాత సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో పెళ్లి చేసుకొని ప్రస్తుతం అమెరికా లో సెట్ల్ అయ్యింది లయ.తన సమయం మొత్తాన్ని తన ఫ్యామిలీ కి కేటాయిస్తుంది లయ.తెలుగు లో లయ చివరగా 2018 లో రిలీజ్ అయినా అమర్ అక్బర్ ఆంటోనీ అనే చిత్రంలో గెస్ట్ పాత్రలో నటించింది.అయితే లయ త్వరలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి.
View this post on Instagram