సినిమా ఇండస్ట్రీలో విషాదం…నటి మీనా భర్త ఆకస్మిక మృతి…

meena husband

సినిమా ఇండస్ట్రీలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది.హీరోయిన్ మీనా భర్త ఆకస్మిక మరణంతో సినిమా లోకం మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది.ఈ విషయం తెలిసిన వెంటనే సినిమా ప్రముఖులు సంతాపం తెలిపారు.మీనా భర్త విద్యాసాగర్ చెన్నై లోని ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా సమస్యతో చికిత్స తీసుకుంటున్నారు.పావురాల రెట్టల వలన ఆయనకు ఇన్ఫెక్షన్ సోకింది.ఆ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులపై ప్రభావం చూపిందని డాక్టర్లు వెల్లడించారు.

కొన్ని రోజుల నుంచి బాగానే ఉన్నప్పటికీ ఇన్ఫెక్షన్ మల్లి ఎక్కువైందని డాక్టర్లు తెలిపారు.దాంతో మీనా భర్త విద్యాసాగర్ ఆసుపత్రిలోనే తుదిశ్వాసను విడిచారు.మీనా 2009 సంవత్సరంలో విద్యాసాగర్ ను వివాహం చేసుకున్నారు.విద్యాసాగర్ బెంగళూరు కు చెందిన వ్యాపారవేత్త.ఈ దంపతులకు ఒక పాపా కూడా ఉంది.పాప పేరు నైనికా.నైనికా తేరి లో దళపతి కూతురిగా నటించడం జరిగింది.

meena husband
Heroine Meena Husband Passes away

ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు కానీ అకస్మాత్తుగా ఆయన పరిస్థితి దిగజారింది.ఈ సంవత్సరం ప్రారంభంలో జనవరి లో మీనా కుటుంబం కోవిద్ బారిన పడింది.కొంతమందిలో ఈ కరోనా తీవ్రమైన ప్రభావాన్ని చూపింది.ఇది సామాన్యుల నుంచి సెలెబ్రెటీల వరకు ఎవ్వరిని వదలకుండా సోకింది.మీనా భర్త ఆరోగ్యం క్షిణించినప్పుడు ఆయనకు ఊపిరితిత్తుల ట్రాంప్లాంటేషన్ చేయాలని వైద్యులు భావించారు.బ్రెయిన్ డెడ్ అయినా వ్యక్తి అవయవం దొరికితే చేయాలనీ భావించారు.కానీ అంతలోనే మీనా భర్త జూన్ 28 న తుది శ్వాసను విడిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *