నందమూరి బాలకృష్ణ,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సింహ,లెజెండ్ వంటి హిట్ సినిమాల తర్వాత వచ్చిన మూడో సినిమా అఖండ.ఇక ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కూడా భారీ విజయం అందుకున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి వీరిద్దరూ హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు.ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాలో బాలయ్య అఖండ పాత్రలో పెర్ఫార్మన్స్ వేరే లెవెల్ అని చెప్పచ్చు.
మొదటి షో నుంచే ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించి మెప్పించారు.ఈ సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయని చెప్పచ్చు.అయితే ఈ సినిమాలోని ఒక పొరపాటు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.ఈ సినిమాలో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ జిల్లా కలెక్టర్ గా నటించారు.
అయితే ఆమె జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత పోలీస్ కి ఒక విషయంలో నెంబర్ అడిగి తీసుకోని ఆ నెంబర్ కి ఫోటో వాట్సాప్ చేశాను అని చెప్పడం జరుగుతుంది.అయితే ఆమె కీప్యాడ్ ను గమనిస్తే పోలీస్ చెప్పిన నెంబర్ ఒకటి,హీరోయిన్ డైల్ చేసిన నెంబర్ ఒకటి.అలాగే కీప్యాడ్ లో నెంబర్ డైల్ చేస్తే వాట్సాప్ కి మెసేజ్ ఎలా వెళ్తుంది..వాట్సాప్ కి మెసేజ్ పంపాలంటే ముందు నెంబర్ సేవ్ చేసుకోవాలి ఆ తర్వాత వాట్సాప్ కి మెసేజ్ చేయాలి కదా..ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
View this post on Instagram