బొద్దుగా ఉన్న తగ్గేదేలే అంటూ డాన్స్ చేసిన నమిత….సూపర్ అంటూ నెటిజన్లు ఫిదా…వీడియొ వైరల్…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన సొంతం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ నమిత.మొదటి సినిమాతోనే తన అందంతో,అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నమిత.ఆ తర్వాత ఈమె జెమినీ,ఒక రాజు ఒక రాణి,ఓ రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి వంటి పలు చిత్రాలలో నటించడం జరిగింది.ఈ సినిమాలతో పాటు ఐతే ఏంటి,నాయకుడు,సింహ,బిల్లా వంటి సినిమాలలో కూడా నటించడం జరిగింది.కానీ స్టార్ హీరోయిన్ గా మాత్రం గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.కోలీవుడ్ లో కూడా సినిమాలు చేసిన కూడా అక్కడ కూడా అనుకున్నంతగా రానించలేకపోయింది.ఆ తర్వాత బరువు పెరగడంతో సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి.

ఆ తర్వాత నమిత 2017 లో కోలీవుడ్ నటుడు వీరేంద్ర చౌదరి ని వివాహం చేసుకుంది.గుజరాత్ లోని సూరత్ లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ చదువు పూర్తి చేసుకున్న తర్వాత మోడలింగ్ రంగంలో ఎంట్రీ ఇచ్చింది.సినిమాలోకి ఎంట్రీ ఇవ్వక ముందు ఈమె అందాల పోటీలలో కూడా పాల్గొనడం జరిగింది.17 ఏళ్ళ వయస్సులో 1998 లో మిస్ సూరత్ గా కిరీటం గెలుచుకున్న నమిత ఆ తర్వాత 2001 లో మిస్ ఇండియా పోటీలలో మూడో స్థానంలో నిలిచింది.ఆ తర్వాత ముంబై కు వెళ్ళిపోయినా ఈమె కొన్ని ఉత్పత్తులకు ప్రమోటర్ గా పని చేసింది.

తాజాగా నమిత డాన్స్ వీడియొ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటుంది.తెలుగు యాక్టర్ నందుతో కలిసి అదిరిపోయే డాన్స్ చేసింది నమిత.ఈ వీడియొ లో కాస్త స్లిమ్ గా కనిపించిన నమిత చెమటలు కక్కుతూ డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించింది.ఈ వీడియొ ను చూసిన నెటిజన్లు అద్భుతంగా డాన్స్ చేసారంటూ కొంత మంది…కళ్ళు తిప్పుకోనివ్వకుండా డాన్స్ చేసారంటూ కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *