ఇమాన్యుల్ పూర్ణ భుజం పై చేయి వేయగానే..అలా ఎలా టచ్ చేసావ్ అంటూ బాగా సీరియస్ అయినా పూర్ణ..


ప్రస్తుతం బుల్లితెర మీద ప్రసారం అవుతున్న ఎంటర్టైన్మెంట్ షో లలో శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా ఒకటి.ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే ఈ షో కు చాల క్రేజ్ ఉంది అని చెప్పచ్చు.టాలెంట్ ఉన్న కొత్త వాళ్ళను ఈ షో ద్వారా పరిచయం చేస్తూ ఇన్స్పైరింగ్ స్కిట్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.ఈ షో కు మొన్నటివరకు సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యవహరించేవాడు.ప్రస్తుతం సుధీర్ సినిమా అవకాశాలతో బిజీ గా ఉండడంతో రష్మీ ఈ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

ఇటీవలే తాజాగా ఈ షో నుంచి విడుదల అయినా ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ ప్రోమోలో యాంకర్ రష్మీ,హైపర్ ఆది పంచ్లు అందరిని ఆకట్టుకున్నాయి.వాటితో పాటు ఈ షో కు జడ్జి గా వచ్చిన పూర్ణ,ఇమాన్యుల్ మధ్య జరిగిన వివాదం కూడా వైరల్ అవుతుంది.వైరల్ అవుతున్న ఈ ప్రోమో లో పూర్ణ స్టేజి మీద మాట్లాడుతుండగా ఇమాన్యుల్ వచ్చి పూర్ణ భుజం మీద చేయివేస్తాడు.

అంతే వెంటనే సీరియస్ అయినా పూర్ణ..ఏం చేస్తున్నావ్ నువ్వు..నన్ను అలా ఎలా టచ్ చేస్తావ్ అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది.పూర్ణ మాటలకూ అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ కు గురైయ్యారు.ఏం జరుగుతుందో అర్ధం కానీ స్థితిలో పూర్ణ అక్కడ నుంచి వెళ్లిపోవడం విమర్శలకు దారి తీస్తుంది.తాజాగా వీరిద్దరి మధ్య జరిగిన వివాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వెళ్తుంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *