టాలీవుడ్ లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రియమణి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.చాల మంది హీరోయిన్లు పెళ్లి తర్వాత తెరకి సినిమాలకు దూరంగా ఉంటారు.కానీ నటి ప్రియమణి మాత్రం ఇందుకు భిన్నం అని చెప్పచ్చు.ఆమె పెళ్లి తర్వాత చెన్నై ఎక్ష్ప్రెస్స్ సినిమాలో వన్ టు త్రి ఫోర్ అని హీరో షారుక్ ఖాన్ తో ఆడి పాడిన సంగతి తెలిసిందే.ఆ పాట అప్పట్లో బాగా ఫేమస్ అయింది అని చెప్పచ్చు.డాన్స్ అంటే ఎంతో ఇష్టం ఉన్న ప్రియమణి తాజాగా తానూ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియొ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది.క్రీం కలర్ టి షర్ట్ మరియు రెడ్ లెగ్గింగ్ ధరించి తన టీం తో కలిసి ప్రియమణి డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది.
బెంగళూరు లో పుట్టి పెరిగిన నటి ప్రియమణి కెరీర్ ప్రారంభం లో మోడలింగ్ రంగంలో అడుగు పెట్టి మంచి పేరు సంపాదించుకుంది.2003 లో రిలీజ్ అయినా ఎవరి అతగాడు అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయింది ప్రియమణి.కానీ ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోవడంతో ప్రియమణి ఎవరికి తెలియదు.ఆ తర్వాత ప్రియమణి తమిళ్ మరియు మలయాళం లో నాలుగు సినిమాలలో నటించింది.
ఆ తర్వాత మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత ప్రియమణి హీరో జగపతి బాబు కు జోడిగా పెళ్ళైన కొత్తలో అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాతో ప్రియమణి తన అందంతో నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇక ఈ చిత్రం హిట్ తర్వాత ప్రియమణి రాజమౌళి దర్శకత్వంలో హీరో ఎన్టీఆర్ కు జోడిగా యమదొంగ సినిమాలో నటించింది.యమదొంగ బిగ్గెస్ట్ హిట్ తర్వాత ప్రియమణి కి సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.ప్రియమణి ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ లో కూడా నటించడం జరిగింది.తాజాగా ప్రియమణి తన టీం తో డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియొ సోషల్ మీడియాలో అందరిని ఆకట్టుకుంటుంది.