చిన్నప్పుడు క్యూట్ గా ఉండే షామిలి ప్రస్తుతం ఎవ్వరు గుర్తుపట్టనంతగా మారిపోయింది…ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా…

సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ తన నటనతో అందరిని ఆకట్టుకుంది బేబీ షామిలి.అంజలి సినిమాలో అంజలి అంజలి మెరిసే నవ్వుల పువ్వుల జాబిల్లి అంటూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది బేబీ షామిలి.ఆ తర్వాత షామిలి హీరో సిద్ధార్థ్ కు జోడిగా ఓయ్ సినిమాలో నటించి అంతగా అలరించలేకపోయింది.అప్పట్లో షామిలి చిన్నప్పుడు ఎంతో ముద్దుగా ఉన్నా పెద్దయ్యాక లావుగా ఉందని మోహంలో చిన్ననాటి కళ లేదంటూ చాలానే ట్రోల్స్ వచ్చాయి.

ఓయ్ సినిమా కూడా అనుకున్నంత విజయం సాధించలేకపోయింది.ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన షామిలి సన్నగా మారిపోయి నాగసౌర్య కు జోడిగా అమ్మమ్మ గారి ఇల్లు సినిమాలో హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చింది.అయినా కూడా అవకాశాలు రాకపోవడంతో సినిమాలకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి పెట్టింది.

తాజాగా తన సోదరి షాలిని అజిత్ ఫ్యామిలీ ఫంక్షన్ లో కనిపించి అందరిని షాక్ కు గురిచేసింది.అక్క షాలిని ఆమె కూతురు అనుష్క తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది షామిలి.సరికొత్త లుక్ లో సన్నగా కనిపించి అందరికి షాక్ ఇచ్చింది షామిలి.సూపర్ గా చాల అందంగా మారిపోయింది షామిలి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్న ఈ ఫోటోలకు నెటిజన్లు విభిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *