తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వాళ్లలో హీరోయిన్ స్నేహ కూడా ఒకరు.ఈమె సుహాసిని రాజారామ్ నాయుడు.స్నేహ 1981 అక్టోబర్ 12 న ముంబై లోని తెలుగు ఫ్యామిలీ లో జన్మించారు.ఇంగానే ఓరు నిలపక్షి అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు స్నేహ.ఆ తర్వాత టాలీవుడ్ లో లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న తరుణ్ కు జోడిగా ప్రియమైన నీకు అనే సినిమాతో హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
అచ్చ తెలుగు అమ్మాయిలాగా కనిపించే స్నేహ తన మొదటి సినిమాతోనే తన అందంతో,నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారని చెప్పచ్చు.తోపివలపు సినిమాలో అమాయకపు అమ్మాయిల కనిపించిన స్నేహ ఆ తర్వాత వెంకీ,హనుమాన్ జంక్షన్,శ్రీరామదాసు వంటి చిత్రాలతో ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగార్జున,వెంకటేష్,బాలకృష్ణ,

2011 లో నాగార్జున హీరోగా వచ్చిన రాజన్న సినిమా తర్వాత ఆమె సినిమాలకు దూరమయ్యారు.ఆ తర్వాత 2012 మే 11 న ప్రసన్న వెంకటేసన్ అనే తమిళ్ హీరోను పెళ్లి చేసుకున్నారు స్నేహ.ఈ దంపతులకు ఒక బాబు,ఒక పాప సంతానం ఉన్నారు.ఆ తర్వాత స్నేహ 2014 లో ఉలవచారు బిర్యానీ తో సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసారు.సినిమాలతోనే కాకుండా బుల్లితెర మీద కూడా రియాలిటీ షోస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు స్నేహ.