Sonali Bendre: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో అక్కినేని నాగార్జున కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇప్పటి వరకు ఆయన తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందుకున్నారు.అమ్మాయిల కళల రాకుమారుడిగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు నాగార్జున.ఇక నాగార్జున సూపర్ హిట్ సినిమాలలో మన్మధుడు సినిమా కూడా ఒకటి.
బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా ఈ చిత్రానికి విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించారు.మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు కథను అందించారు.

ఇక ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా సోనాలి బింద్రే మరియు అన్షు నటించారు.ఈ సినిమాలో సోనాలి బింద్రే తన అందంతో,అభినయంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.

సోనాలి బింద్రే హీరో మహేష్ బాబు కు జోడిగా మురారి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.

ఇక ఆ తర్వాత తెలుగులో ఇంద్ర,ఖడ్గం,మన్మధుడు వంటి హిట్ సినిమాలలో నటించింది.సోనాలి తెలుగుతో పాటు హిందీ,కన్నడ లో కూడా పలు సినిమాలలో నటించింది.ఇక ఇటీవలే ఈమెకు సంబంధించి లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram