Honey Rose: ప్రస్తుతం యూత్ లో బాగా క్రేజ్ ను సొంతం చేసుకున్న హీరోయిన్ హాని రోజ్.ఆమె తన అందంతో కుర్రకారును కట్టి పడేసింది.కేవలం ఒక్క సినిమాతోనే ఆమె స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సంపాదించుకుంది.గోపీచంద్ మలినేని తెరకెక్కించిన వీర సింహ రెడ్డి సినిమా లో హీరో బాలకృష్ణ కు జోడిగా నటించింది హాని రోజ్.ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించి బాలకృష్ణ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించడం జరిగింది.సోషల్ మీడియా లో ఎక్కువగా ఆక్టివ్ గా ఉండే హాని రోజ్ కు ఫాలోయింగ్ బాగా ఉంది.
అయితే తాజాగా హాని రోజ్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.హాని రోజ్ ఒక సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటిస్తుందని వార్తలు వస్తున్నాయి.అయితే ఈ స్పెషల్ సాంగ్ కోసం హాని రోజ్ ఏకంగా కోటి రూపాయలు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు కూడా వినిపిస్తుంది.ప్రస్తుతం హాని రోజ్ రాచెల్ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తుంది.ఇక హాని రోజ్ విశ్వక్ సేన్ నటిస్తున్న గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు సమాచారం.
దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రావలసి ఉంది.వీర సింహారెడ్డి సినిమా తర్వాత హాని రోజ్ కు దర్శక నిర్మాతల నుంచి అఫర్ లు వస్తున్నాయి.తన అందంతో అందరిని ఊరించే హాని రోజ్ సౌత్ లో త్వరలో బిజీ హీరోయిన్ గా మారనుందని సినిమా విశ్లేషకుల అంచనా.ఇక హాని రోజ్ స్టార్ హీరో ల సరసన నటించే అవకాశం కోసం వెయిట్ చేస్తున్నట్లు సమాచారం.ఇక మూవీ మేకర్స్ కూడా సీనియర్ హీరోలకు జోడిగా హాని రోజ్ బెస్ట్ ఛాయస్ అని చెప్తున్నారు.ప్రస్తుతం మలయాళంలో సినిమాలు చేస్తున్న హాని రోజ్ కు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో పాటు గ్లామర్ పాత్రలు కూడా వస్తున్నాయని తెలుస్తుంది.
View this post on Instagram