Ileana D’Cruz: తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ఇలియానా ప్రస్తుతం సినిమాలను తగ్గించిన విషయం అందరికి తెలిసిందే.తెలుగులో సినిమాలు చేసిన సమయంలోనే ఇలియానా తమిళ్ లో కూడా సినిమాలు చేసింది.ఇక అదే సమయంలో ఇలియానా హిందీలో కూడా సినిమాలు చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.కానీ హిందీ లో మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది ఇలియానా.దాంతో ఇలియానా సినిమా కెరీర్ ముగిసిపోయిందని చెప్పచ్చు.
అయితే ఇలియానా హిందీలోకి అడుగుపెట్టిన తర్వాత ప్రేమలో పడటం,బ్రేక్ అప్ జరగటం,డిప్రెషన్ లోకి వెళ్లిపోవడం ఇలా అన్ని చక చకా జరిగిపోయాయని చెప్పచ్చు.ఆ తర్వాత చాల లావుగా మారిపోయిన ఇలియానా తెలుగులో రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించలేకపోయింది.ఇక ఆ సినిమా పరాజయం తర్వాత మల్లి సినిమాలలో నటించలేదు ఇలియానా.
ప్రస్తుతం తిరిగి మల్లి సన్నజాజిలా మారిపోయింది ఇలియానా.సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటూ తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అందరిని అలరిస్తూ ఉండేది ఇలియానా.ఈ క్రమంలోనే బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను షేర్ చేసి తానూ ప్రేగ్నన్ట్ అని అందరికి షాక్ ఇచ్చింది.అయితే ఇలియానా ఇప్పటి వరకు తన బాయ్ ఫ్రెండ్ ఎవరు అనేది ఎప్పుడు కూడా చెప్పలేదు…రివీల్ చేయలేదు.తాజాగా ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ ఫోటోను అందరితో పంచుకుంది.గతంలో ఈమె కత్రినా కైఫ్ తమ్ముడు సెబాస్టియన్ లారెన్స్ మిచెల్ తో లవ్ లో ఉందని వార్తలు వినిపించాయి.కానీ ఈ ఫోటోలో ఉన్నది సెబాస్టియన్ కాదు అని నెటిజన్లు అంటున్నారు.మరి అతని పేరు ఇలియానా బయటపెడుతుందేమో వేచి చూడాల్సిందే.
View this post on Instagram