Home సినిమా Ileana: మొదటి సారి కొడుకు ఫోటోను షేర్ చేసిన ఇలియానా…క్యూట్ ఫొటోస్

Ileana: మొదటి సారి కొడుకు ఫోటోను షేర్ చేసిన ఇలియానా…క్యూట్ ఫొటోస్

0
Ileana
Ileana

Ileana: టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా ఇటీవలే రెండు నెలల క్రితం ఒక బిడ్డకు జన్మనిచ్చిన సంగతి అందరికి తెలిసిందే.అక్టోబర్ 1 న తన కొడుకుకు రెండు నెలలు నిండిన సందర్భంగా ఇలియానా తన కొడుకు తో దిగిన ఫోటోను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.భుజం పై తన కొడుకు తో సెల్ఫీ దిగిన ఫోటోను ఇలియానా షేర్ చేయడం జరిగింది.అప్పుడే రెండు నెలలు అయ్యింది అంటూ ఈ ఫోటోను ఇలియానా షేర్ చేసింది.గతంలో తన ప్రెగ్నన్సీ ఫోటోలను షేర్ చేసిన ఇలియానా ఇక మొదటి సరిగా తన కొడుకును చూపిస్తూ ఫోటోను షేర్ చేసారు.ఈ ఫొటోకు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ నటి నటులు కూడా స్పందిస్తూ క్యూట్ బేబీ అంటూ హార్ట్ ఇమేజస్ పంపుతున్నారు.

ఆగష్టు 1 న మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా తన కొడుకుకు కోవా ఫియోనిక్స్ డోలాన్ అనే పేరును పెట్టినట్లు తన ఆనందాన్ని అందరితో పంచుకున్నారు.ఇక ప్రస్తుతం తన కొడుకు కు రెండు నెలలు నిండిన సందర్భం గా తన కొడుకు ఫోటోను షేర్ చేస్తూ ఇలియానా అప్పుడే రెండు నెలలు నిండాయి అంటూ కాప్షన్ ఇచ్చారు.ఎంతో క్యూట్ గా ఉన్న ఇలియానా కొడుకును చూసి అటు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ నటి నటులు కూడా స్పందిస్తూ హార్ట్ ఇమోజిస్ పంపుతున్నారు.

క్యూట్ బేబీ,బెస్ట్ మదర్ మీపై దేవుడి ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇలియానా ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.తెలుగు లో దాదాపు అందరు స్టార్ హీరోలకు జోడిగా నటించి మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది ఇలియానా.ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా అవకాశాలు రావడంతో అక్కడ కూడా పలు సినిమాలలో నటించింది ఇలియానా.ఆ తర్వాత కొన్ని రోజులు సినిమాలకు దూరం గా ఉన్న ఇలియానా తానూ ప్రేగ్నన్ట్ అంటూ తన ప్రెగ్నన్సీ ఫోటోలను షేర్ చేస్తూ అందరికి షాక్ ఇచ్చింది.ఒక మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here