క్యూట్ గా ఉన్న ఈ చిన్నారి ప్రస్తుతం టాలీవుడ్ టు బాలీవుడ్ షేక్ చేస్తున్న స్టార్ హీరోయిన్….ఎవరో గుర్తుపట్టగలరా…

ఇటీవలే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సెలెబ్రెటీలకు మరియు సామాన్యులకు మధ్య దూరం తగ్గిపోయింది.సెలెబ్రెటీలు తమకు సంబంధించిన లేటెస్ట్ ఫొటోస్,వీడియోలు దగ్గర నుంచి తమ చిన్ననాటి ఫోటోలు వాటి జ్ఞాపకాలను కూడా సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులతో పంచుకుంటున్నారు.సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చి అభిమానులతో ఇంటరాక్ట్ కూడా అవుతున్నారు చాల మంది నటి నటులు.ఇప్పటికే దాదాపుగా చాల మంది హీరో,హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.తమకు నచ్చిన నటి నటుల చిన్ననాటి ఫోటోలు చూడడానికి అభిమానులు కూడా బాగా ఆసక్తిని కనబరుస్తున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రో బ్యాక్ ఫోటోలు చాలానే ప్రతి రోజు వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం ఒక టాలీవుడ్ హీరోయిన్ చిన్ననాటి క్యూట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.జీన్స్ వేసుకొని ఫోటోలు ఫోజులిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్.మొదటి సినిమాతోనే తన అందంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.తెలుగు లో స్టార్ హీరోలు అందరితోనూ జోడిగా నటించింది ఈ అమ్మడు.ప్రస్తుతం హిందీలో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది.

ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో కాదు దేవదాసు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా ఇలియానా.దేవదాసు చిత్రం తర్వాత పోకిరి వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని వరుసగా అవకాశాలను దక్కించుకుంది.జల్సా,కిక్,జులాయి వంటి హిట్ సినిమాలు చేసింది.తాజాగా ది బిగ్ బుల్ చిత్రంతో ఒటిటి లో కూడా సందడి చేసింది.ప్రస్తుతం ఇలియానా తేరా క్యా హోగా లవ్లీ అనే చిత్రంలో నటిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *