టాలీవుడ్ స్టార్ యాంకర్ అయినా సుమ కు షూటింగ్ లో పెద్ద ప్రమాదమే తప్పింది.ఇటీవలే సుమ ప్రధాన పాత్రలో నటించిన జయమ్మ పంచాయతీ సినిమా రిలీజ్ అయినా సంగతి అందరికి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదానికి గురైన సంగతి స్వయంగా సుమ చెప్పుకొచ్చారు.ఈ సినిమా షూటింగ్ లో భాగంగా సుమ ఒక అడవిలోకి వెళ్లాల్సి వచ్చింది.అక్కడ ఒక కాలువలో నీరు ప్రవహిస్తూ ఉన్నాయి.అక్కడే నాచు పట్టి ఉన్న రాళ్ళూ కూడా ఉన్నాయి.అయితే అక్కడ నుంచొని ఉన్న సుమ కాలు ఒక్కసారిగా జారడంతో ఆమె ఒక్కసారిగా కింద పడిపోయింది.
వెంటనే సుమ తనను తానూ కంట్రోల్ చేసుకోవడంతో ఇంకా కిందకు జారకుండా బయటకు వచ్చేసింది.ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను సుమ తన ఇంస్టా ఖాతా ద్వారా షేర్ చేస్తూ తృటిలో ప్రమాదం తప్పింది అంటూ చెప్పుకొచ్చింది.తాజాగా సుమ షేర్ చేసిన ఈ వీడియొ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.ఈ వీడియోను చుసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.జాగ్రత్త సుమక్క,మీకేమైనా అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్స్,ప్రొడక్షన్ టీమ్స్,మొత్తం ఎంటర్టైన్మెంట్స్ కే ఇబ్బంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు చాల మంది నెటిజన్లు.
ఇక ఈ సినిమా మొత్తం శ్రీకాకుళం నేపథ్యంలో సాగే ఒక గ్రామీణ కథ.విజయ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.బలగ ప్రకాష్ వెన్నెల కిషోర్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు.థియేటర్స్ లో మే 6 న రిలీజ్ అయినా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.అయితే మరోవైపు ఈ చిత్ర యూనిట్ సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు.జయమ్మ పంచాయతీ పేరుతొ స్వీట్ బాక్స్ లు కూడా రెడీ చేసారు చిత్ర యూనిట్.స్వీట్ తిని సెలెబ్రేట్ చేసుకుంటున్న వీడియోను కూడా సుమ షేర్ చేయడం జరిగింది.రిలీజ్ అయినా ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో చిత్ర యూనిట్ మొత్తం సుమ ఇంటి దగ్గర టపాసులు కాల్చి సందడి చేసుకుంటున్నారు.
View this post on Instagram