Home తాజా వార్తలు దేశంలో ఒక్క రోజులోనే 17 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు…

దేశంలో ఒక్క రోజులోనే 17 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు…

0

దేశంలో మళ్ళీ కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది.రోజుకు వెలది మంది బాధితులుగా మారుతున్నారు.బుధవారం 13 వేల మంది కరోనా బాధితులుగా మారారు.జూన్ 23 గురువారం రోజున 17 ,336 పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగింది.శుక్రవారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనా బులిటెన్ విడుదల చేయడం జరిగింది.సుమారు నాలుగు నెలల తర్వాత కరోనా పాజిటివ్ కేసులు 17 వేలు దాటడం గమనించవచ్చు.

దేశంలో మొత్తం కరోనా కేసు ల సంఖ్యా 4 ,33 ,62 ,294 కు చేరాయి.వైరస్ కారణంగా నిన్న 13 మంది చనిపోవడం జరిగింది.ఇప్పటి వరకు 5 ,24 ,954 మృతి చెందారు.గడిచిన 24 గంటల్లో 13 ,029 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవ్వడం జరిగింది.అత్యధికంగా మహారాష్ట్రలో 5 ,218 కేసు లు నమోదయ్యాయి.కేరళలో 3890 ,ఢిల్లీ లో 1934 ,తమిళనాడు లో 1063 ,కర్ణాటక లో 858 కొత్త కేసులు నమోదయ్యాయి.రికవరీ కంటే కొత్త కేసులు పెరుగుతుండడంతో ఆక్టివ్ కేసులు పెరుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here