Home తాజా వార్తలు ఇండియా,పాక్ సరిహద్దుల్లో పుట్టిన బిడ్డకు ఏం పేరు పెట్టారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

ఇండియా,పాక్ సరిహద్దుల్లో పుట్టిన బిడ్డకు ఏం పేరు పెట్టారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

0

ప్రస్తుతం ఆధునికతా పెరుగుతున్న సమయంలో తల్లి తండ్రులు తమ పిల్లలకు పెట్టె పేర్లు కూడా ఏంటో స్పెషల్ గా ఉండాలని చాల అలోచించి మరి పెడుతున్నారు.తాజాగా ఒక జంట తమకు అప్పుడే పుట్టిన బిడ్డకు పెట్టిన పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో అందరిని బాగా ఆకట్టుకుంటుంది అలాగే ఆశ్చర్యానికి కూడా గురిచేస్తుంది.వివరంగా చెప్పాలంటే…పాకిస్తాన్ కు చెందిన ఒక జంట మిగిలిన 97 మంది పాకిస్తానీలతో కలిసి అటారీ సరిహద్దులో చిక్కుకుపోవడం జరిగింది.71 రోజుల నుంచి వారు అక్కడే ఉన్నారు.వాళ్లలో నిండు గర్భిణీ కూడా ఉంది.ఆ గర్భిణీ ఈ నెల డిసెంబర్ 2 న భారత్,పాకిస్తాన్ సరిహద్దులో ఒక మగబిడ్డకు జన్మ నిచ్చింది.

ఆ బిడ్డ భారత్ పాకిస్తాన్ సరిహద్దులో పుట్టడంతో పుట్టిన బిడ్డకు బోర్డర్ అని నామకరణం చేసారు తల్లితండ్రులు.బోర్డర్ అని పేరు పెట్టినట్లు ఆ పిల్లాడి తండ్రి స్వయంగా చెప్పడం జరిగింది.బాలం రామ్,నింబుబాయి అనే జంట పంజాబ్ రాజన్ పూర్ జిల్లాలో ఉంటున్నారు.బాలం రామ్ మాట్లాడుతూ తన భార్య ప్రసవ సమయంలో పక్కనే ఉన్న పంజాబ్ గ్రామాల నుంచి కొంత మంది మహిళలు వచ్చి వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేసారని చెప్పుకొచ్చాడు.అయితే లాక్ డౌన్ కు ముందు తమ బంధువులను కలవడానికి వచ్చామని ఆ తర్వాత తిరిగి వెళ్లే పత్రాలు లేకపోవడంతో అక్కడే ఉండిపోయామని చెప్పుకొచ్చాడు బాలం రామ్.

తమతో పాటు ఇతర పాకిస్తానీయులు అయినా 98 మంది కూడా సరిహద్దులో చిక్కుకుపోయినట్లు తెలిపాడు.వాళ్ళందరూ అటారీ అంతర్జాతీయ చెక్ పోస్ట్ సమీపంలో ఉన్న పార్కింగ్ స్థలం లో ఉండిపోవడం జరిగింది.అక్కడున్న స్థానికులు తమకు ఆహారం,మందులు ఇంకా ఇతర సహాయం అందజేస్తారు అని తెలిపాడు బాలం రామ్.ప్రస్తుతం ఆ జంట తమకు పుట్టిన బిడ్డకు బోర్డర్ అని పేరు పెట్టడం అందరిని బాగా ఆకట్టుకుంటుదని.నెటిజన్లు కూడా పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here