ఇదివరకటి రోజుల్లో సినిమా 50 రోజులు,100 రోజులు థియేటర్లలో ప్రదర్శించబడింది అని వినేవాళ్ళం.కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా 10 రోజులు కూడా థియేటర్లలో ఆడడం కష్టమే.ఒక వారం గడిస్తే చాలు సినిమా కలెక్షన్లు తగ్గిపోతాయి.కానీ వీటన్నిటికీ చెక్ పెడుతూ బాలయ్య సినిమా అఖండ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతుంది.విజయవంతంగా 7 వ వారం అనే పోస్టర్ చాల రోజుల తర్వాత మనకు కనిపిస్తుంది.ఇప్పుడున్న రోజుల్లో ఏ సినిమా కూడా మూడు వారల కంటే ఎక్కువగా ఆడలేదు.అఖండ సినిమాకు మాత్రం ఏడు వారల తర్వాత కూడా హౌస్ బోర్డు కనిపిస్తుంది.
అఖండ సినిమా 46 వ రోజు కూడా థియేటర్లలో మంచి కలెక్షన్లను రాబట్టింది.మరో మూడు రోజుల్లో అఖండ సినిమా సక్సెస్ ఫుల్ గా 50 రోజులు పూర్తి చేసుకోబోతుంది.అఖండ సినిమా డిసెంబర్ 2 న థియేటర్లలో విడుదల అయ్యింది.భారీ అంచనాలతో విడుదల అయ్యిన ఈ చిత్రం అంచనాలకు మించే థియేటర్లలో రాణిస్తుంది.బాలకృష్ణ,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన్న సింహ,లెజెండ్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి.ఇప్పుడు వీరిద్దరి కంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం కూడా బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఈ చిత్రానికి మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు.ఈ చిత్రంలో బాలయ్యకు జోడిగా ప్రగ్య జైస్వాల్ నటించారు.
తమన్ అందించిన సంగీతం కూడా ఈ సినిమాకు బాగా హై లెట్ అని చెప్పచ్చు.పుష్ప,శ్యామ్ సింగరాయి వంటి చిత్రాలు వచ్చిన కూడా బాలయ్య క్రేజ్ తగ్గలేదు.ఇప్పుడు సంక్రాంతికి బంగార్రాజు రిలీజ్ అయ్యిన కూడా అఖండ సినిమాకు చాల చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి.ఈ మధ్య కాలంలో ఇండియాలో ఎక్కడ కూడా ఇలాంటి జోరు చూపించిన సినిమా ఇంకొకటి లేదు.మొత్తం ఇండియా లోనే ఈ రికార్డు బాలయ్యకు మాత్రమే సాధ్యం అయ్యింది.ఈ సినిమాకు 54 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.ఇప్పటి వరకు ఈ చిత్రం 73 కోట్లు షేర్లు రాబట్టింది.దాదాపుగా 18 కోట్లు లాభాలను రాబట్టింది అఖండ చిత్రం.