indraja: బుల్లితెర మీద ప్రసారం అవుతున్న జబర్దస్త్,ఎక్స్ట్రా జబర్దస్త్ షో లకు శ్రీదేవి డ్రామా కంపెనీ గట్టి పోటీ ఇస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ షో ఆదివారం మధ్యాహ్నం ప్రసారం అవుతుంది.ఈ షో కు చాల మంది అభిమానులు ఉన్నారు.ఈ షో లో ఫన్ ఎంటర్టైన్మెంట్ తో పాటు మెసేజ్ ఓరియెంటెడ్ స్కిట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని చెప్పచ్చు.రష్మీ ఈ షో కు యాంకర్ గా మరియు ఇంద్రజ జడ్జి గా చేస్తున్నారు.ప్రతి వారం ఈ షో స్పెషల్ గెస్ట్స్ వస్తూ ఉంటారు.
తాజాగా డిసెంబర్ 11 న ప్రసారం కాబోయే ఈ షో ప్రోమో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.ఈ ఎపిసోడ్ లో ముఖచిత్రం టీం స్పెషల్ గెస్ట్ గా రావడం జరిగింది.హుషారు ఫ్రెమ్ ప్రియా వడ్లమాని ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.ముఖచిత్రం డైరెక్టర్ సందీప్ రాజ్ మరియు హీరోయిన్ ప్రియా ఈ షో లో పాల్గొన్నారు.ఇక ఈ షో లో హైపర్ ఆది ఆమెను టీజ్ చేయడానికి చూస్తే..ఆమె అన్నయ్య అని పిలిచి షాక్ ఇవ్వడం ఫన్ క్రియేట్ చేసాయి.
ఈ షో కు జడ్జి గా వ్యవహరిస్తున్న ఇంద్రజ తన డాన్స్ తో అందరిని ఆశ్చర్యపరిచారు.ఆమె హీరోయిన్ గా చేసిన సమయంలోనే ఆమె డాన్స్ కు కూడా చాల మంది అభిమానులు ఉన్నారని చెప్పచ్చు.ముందు ప్రియమైన నీకు సినిమాలోని మనసున ఉన్నది అనే పాటకు డాన్స్ చేసి ఆ తర్వాత గజినీ సినిమాలోని రహాతుల్లా రహాతుల్లా అనే డాన్స్ కు ఫుల్ ఎనర్జీ తో డాన్స్ చేసి అందరిని ఆశ్చర్య పరిచారు ఇంద్రజ.