సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరో కెరీర్ ను మలుపు తిప్పిన ఒక సినిమా ఉంటుంది.ఆ హీరోను స్టార్ గా నిలబెట్టిన ఆ సినిమా వెనుక చాల చరిత్ర,ట్విస్టులు ఉంటాయి.ప్రతి హీరో కూడా సినిమా కథలను ఎంచుకోవడంలో చాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఒక్కోసారి ఫెయిల్ అయినా సందర్భాలు కూడా ఉంటాయి.అలాగే ఒక్క బ్లాక్ బస్టర్ చిత్రం ఆ హీరోను స్టార్ హీరో ల లిస్ట్ లో చేర్చిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.ఈ క్రమంలోనే ఆర్య సినిమా అల్లు అర్జున్ కు లైఫ్ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే.
కానీ ఆర్య సినిమాకు ముందు అల్లు అర్జున్ ఎన్ని కథలను రిజెక్ట్ చేసారో తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.ఏకంగా అల్లు అర్జున్ ఆర్య సినిమాకు ముందు 96 కథలను రిజెక్ట్ చేశారట.ఆర్య సినిమాకు దర్శకత్వం వహించిన సుకుమార్ ముందు మ్యాథ్స్ టీచర్ గా పని చేసేవారు.ఆ తర్వాత సినిమాల మీద ఆసక్తి తో సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసారు.ఆ క్రమంలోనే దిల్ సినిమా చేసే సమయంలో సుకుమార్ కసిని చూసిన నిర్మాత దిల్ రాజు దిల్ సినిమా సూపర్ హిట్ అయితే నీకు ఆఫర్ ఇస్తాను కథను రెడీ చేసుకో అని చెప్పారట.

అప్పటికే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమయంలో సుకుమార్ ఆర్య కథను రాసుకున్నారు.ఇక దిల్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో దిల్ రాజు సుకుమార్ ను ఆఫీస్ కు పిలిచి కథ విన్నారట.అయితే ఈ కథకు ముందుగా ప్రభాస్,నితిన్,రవితేజ లను సంప్రదించారు.కానీ వాళ్ళు నో చెప్పడంతో ఈ సినిమాకు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటె బాగుంటుందని సుకుమార్ భావించారట.ఇక అప్పటికే గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బన్నీ అయితే ఈ కథకు బాగా సూట్ అవుతాడని సుకుమార్ భావించారట.
ఆ తర్వాత అల్లు అర్జున్ ను ఆఫీస్ పిలిచి కథ చెప్పడం జరిగింది.ఇక అప్పటికే తానూ 96 కథలను విన్నానని అన్ని కూడా రొటీన్ కథలని బన్నీ చెప్పడం జరిగింది.ఇక అల్లు అర్జున్ కు ఆర్య కథ నచ్చడంతో అల్లు అరవింద్ కు కూడా ఈ కథను వినిపించడం జరిగింది.ఇలా ఆర్య సినిమా పట్టాలెక్కి సూపర్ హిట్ అందుకుంది.ఈ సినిమా తర్వాత సుకుమార్ క్రేజీ దర్శకుడిగా మరియు అల్లు అర్జున్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.
