1997 సంవత్సరం లో కోరుకున్న ప్రియుడు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు వడ్డే నవీన్.మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నారు.ఆ తర్వాత పెళ్లి సినిమాతో మరొక హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.దాంతో వరుస అవకాశాలతో నవీన్ కెరీర్ దూసుకుపోయింది.కానీ యెంత త్వరగా నవీన్ స్టార్ అయ్యాడో అంతే త్వరగా ఫేడ్ అవుట్ అయ్యాడు అని చెప్పచ్చు.వడ్డే నవీన్ నందమూరి కుటుంబానికి దగ్గరి బంధువు అవుతాడు అనే విషయం చాల మందికి తెలియదు.
హీరో జూనియర్ ఎన్టీఆర్ కు వడ్డే నవీన్ బావ అవుతారు అనే విషయం కూడా బహుశా చాల మందికి తెలియక పోవచ్చు.వడ్డే రమేష్ గారి కుమారుడు అయినా వడ్డే నవీన్ కి ముందు నుంచి సినిమా పరిచయాల వలన సినిమాల ఆసక్తి ఎక్కువగా ఉండేది.ఎన్టీఆర్ వడ్డే నవీన్ కు ముందు నుంచి కూడా మంచి స్నేహితుడు అంటూ చాలా మంది చెప్తుంటారు.

ఇక నవీన్ సినిమాలలోకి వచ్చిన తర్వాత సీనియర్ ఎన్టీఆర్ గారి అబ్బాయి రామకృష్ణ కూతురును ఇచ్చి వివాహం చేసారు.ఇక అప్పటి వరకు స్నేహితులుగా ఉన్న ఎన్టీఆర్ మరియు నవీన్ కాస్త బంధువులుగా మారారు.ఇక కొన్ని వ్యక్తిగత కారణాల వలన వడ్డే నవీన్ ఆయన భార్య విడిపోవడం జరిగింది.ఇక సినిమాల్లో కూడా వడ్డే నవీన్ మెల్ల మెల్లగా దూరం అయ్యారు.మళ్ళీ నవీన్ మంచి కథతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి భావిస్తున్నట్లు సమాచారం.