ఇంటి పైకప్పు పై ఇలాంటి వస్తువులు ఉంటే వెంటనే తీసేయండి…లేకపోతే ఆర్ధిక ఇబ్బందులు తప్పవు…

చాల మంది తమ ఇండ్లలో వస్తువులు వాస్తు ప్రకారం అమర్చుకుంటారు.కానీ ఇంటి పైకప్పు మీద ఎలాంటి వస్తువులు పెట్టుకోవచ్చు..ఎలాంటి వస్తువులు పెట్టకూడదు అనే విషయం చాల మందికి తెలియదు.మన ఇంట్లో పనికి రాని ఏ వస్తువు కనిపించిన కూడా వెంటనే పైన పెట్టేస్తుంటారు చాల మంది.కానీ ఇంటి పైకప్పు మీద కూడా కొన్ని వస్తువులు ఉండకూడదు అని వాస్తు శాస్త్రం ప్రకారం చాల మంది నమ్ముతారు.ఇలా కొన్ని వస్తువులు పెట్టడం వలన ఆర్ధిక ఇబ్బందులను కూడా ఎదురుకోవలిసి వస్తుంది అని నిపుణులు చెప్తున్నారు.మరి ఇంటి పైకప్పు మీద ఇలాంటి వస్తువులు ఉంటె వెంటనే తీసేయండి.అవి ఏంటంటే….

తుప్పుపట్టిన ఇనుము వస్తువులు:ఇంటి పైకప్పు మీద తుప్పు పట్టిన ఇనుము,పాత వస్తువులు పెట్టడం అశుభకరం అని నమ్ముతారు.ఇలాంటి వస్తువులు పైన పెట్టడం వలన ఆర్ధికంగా మరియు శారీరికంగా కూడా ఇబ్బందులు కలుగుతాయి అని నిపుణులు చెప్తున్నారు. చీపురు:చీపురును లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు చాల మంది.ఇంట్లో చీపురును నిటారుగా ఉంచకూడదు అని చాల మంది చెప్తుంటారు.అల పెట్టడం వలన ఆర్ధిక ఇబ్బందులు ఎదురుకోవలిసి వస్తుంది అని నిపుణులు చెప్తున్నారు.

పగిలిన కుండలు:వాస్తు శాస్త్రం ప్రకారం పగిలిన కుండలను ఇంటి పై పెట్టడం శుభప్రదం కాదు అని నిపుణులు చెప్తున్నారు.ఇంటి పైకప్పు పై పగిలిన కుండలో మొక్కను నాటి కూడా పెట్టకూడదు అని చెప్తున్నారు.
వెదురు:చాల మంది ఇంటి పైకప్పు పై కొంత పని పూర్తి అయినా తర్వాత వెదురు ను ఉంచుతారు.అల చేయడానికి కారణం ఏదైనా ఉన్న కూడా అలా చేయడం వలన చాల సమస్యలు ఏర్పడతాయి అని నిపుణులు చెప్తున్నారు.
ఆకులు:చాల మంది ఇంటి పైకప్పు పై రాలిన ఆకులను శుభ్రం చేయరు.అలా పైకప్పు పై ఆకులు ఉండటం శుభప్రదం కాదు అని చాల మంది నమ్ముతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *