Home తాజా వార్తలు Vastu Tips: ఇంట్లో మొక్కలు ఈ దిశలో పెట్టారంటే సర్వనాశనమే….అదే సరైన దిశలో పెడితే మాత్రం...

Vastu Tips: ఇంట్లో మొక్కలు ఈ దిశలో పెట్టారంటే సర్వనాశనమే….అదే సరైన దిశలో పెడితే మాత్రం ధన వర్షం కురుస్తుంది..!

0
Vastu Tips
Plants

Vastu Tips: చాల మంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు నిర్మిస్తుంటారు.అయితే ఇంట్లో మొక్కలను ఎక్కడ పడితే అక్కడ పెంచకూడని కూడా వాస్తు శాస్త్రం చెబుతుంది.ఏ దిక్కులో ఏ మొక్కలను పెంచవచ్చో అలాగే ఏ దిక్కులో పెంచకూడదో చెప్తుంటారు వాస్తు శాస్త్ర నిపుణులు.వాస్తు శాస్త్రం ప్రకారం నడుచుకుంటే అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి అని నిపుణులు చెప్తుంటారు.ఇంట్లో మొక్కలను సింహ ద్వారానికి ఎదురుగా కానీ కిటికీల పక్కన కానీ చెట్లను పెంచటం వలన ఇంటి యజమానికి కీడు జరిగే ప్రమాదం ఉందని చెప్తారు నిపుణులు.

అందుకే సింహ ద్వారానికి ఎదురుగా కానీ కిటికీల పక్కన కానీ మొక్కలను పెంచకూడదు.అలాగే ఏవైనా పండ్ల మొక్కలను పెంచాలి అని అనుకునే వారు ఇంటికి తూర్పు దిక్కున లేక ఉత్తరం దిక్కున ఎక్కువగా ఖాళీ స్థలాన్ని వదిలి మొక్కలను పెంచుకోవచ్చు.ముఖ్యంగా ఇంటికి ఈశాన్య భాగంలో ఎటువంటి మొక్కలను కూడా పెంచకూడదు.తులసి వంటి దేవత మొక్కలను ఎక్కడ పడితే అక్కడ పెంచకూడదు.ఇలాంటి మొక్కలను ఇంటికి ఆగ్నేయంలో పెంచాలి.తులసి మొక్కను ఆగ్నేయంలో కుండీలో లేక తులసి కోటను కట్టి పెంచాలి అని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తుంటారు.

Vastu Tips
Plants

చాల మంది తీగ జాతి మొక్కలను ఇంటికి అందంగా ఉండేలా పెంచుతారు.కానీ ఆ తీగలు ఇంట్లో కి రాకుండా ఉండేలా చూసుకోవాలి అంటున్నారు నిపుణులు.ఆ తీగలు ఇంట్లో కి వస్తే ఇంట్లో చేదు ప్రభావం చూపించే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు.అయితే చాల మంది తమ ఇళ్లలో తీగ జాతి మొక్క అయినా మనీ ప్లాంట్ ను పెంచుతుంటారు.అది ఇంట్లో ఉంటె ఇంట్లో వాళ్లకు శక్తి ని అదృష్టాన్ని ఇస్తుంది అని చాల మంది చెప్తుంటారు.అలాగని ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ మనీ ప్లాంట్ ను పెంచకూడదట.

ముఖ్యంగా మనీ ప్లాంట్ ను ఈశాన్య భాగంలో ఉంచితే లాభాల కంటే కూడా నష్టాలే ఎక్కువగా ఉంటాయి అని చెప్తున్నారు నిపుణులు.అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉందట.అయితే ఇంటి ఆవరణలో ముళ్ల మొక్కలు కూడా పెంచకూడదు అని చెప్తున్నారు నిపుణులు.గులాబీ మొక్క తప్ప మరి ఏ ఇతర ముళ్ల మొక్కలను ఇంటి ఆవరణలో పెంచితే అవి దురదృష్టాన్ని కలిగిస్తాయట.ఇక వెదురు మొక్క బుధ గ్రహానికి చెందింది.బుధుడు అంటే వ్యాపారవృధికి కారకుడు కాబట్టి ఈ మొక్కను వ్యాపార సంస్థలలో ఉంచితే రోజు రోజు కు వ్యాపారం వృద్ధి చెందుతుంది అని చెప్తున్నారు నిపుణులు.

Vastu Tips
Plants

అలాగే బుధుడు విద్యకు మరియు వాక్ సుద్ధి కి కారకుడు కాబట్టి ఇంట్లో పిల్లలు చదువుకునే చోట ఈ మొక్కను ఉంచితే తెలివితేటలు పెరిగి సమయానికి గుర్తుకు వచ్చే ఆలోచనలు కలుగుతాయి అని చెప్తున్నారు నిపుణులు.అదృష్టాన్ని కలిగించే ఈ వెదురు మొక్కలు ఇంట్లో తూర్పు ఈశాన్య,ఉత్తర దిక్కుల్లో పెంచాలి.ఇంట్లో ఈ మొక్కలను పెంచితే ధనం కూడా పెరుగుతుంది అని నిపుణులు చెప్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here