తాజాగా రిలీజ్ అయినా అఖండ చిత్రంలో బాలకృష్ణ అఘోర పాత్రలో కనిపించి బాక్స్ ఆఫీస్ వద్ద శివతాండవం చేస్తున్నారు.ఈ చిత్రంలో బాలయ్య అఘోర పాత్రకు ప్రేక్షకులు బాగా ఫిదా అయిపోయారు.బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన చిత్రం ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.ఈ చిత్రం లో బాలకృష్ణ కు జోడిగా ప్రగ్య జైస్వాల్ నటించారు.అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో అఘోర పాత్రలో అలరించిన తోలి నటుడు బాలకృష్ణ కాదు.ఇదివరకే కొంత మంది స్టార్ హీరోలు అఘోర పాత్రలలో కనిపించటం జరిగింది.
మెగా స్టార్ చిరంజీవి: శ్రీమంజునాథ చిత్రంలో శివుడిగా నటించడం జరిగింది.ఆ చిత్రంలో భక్తుడిగా ఉన్న అర్జున్ కోసం చిరంజీవి ఒక సన్నివేశంలో అఘోర పాత్రలో కనిపించటం జరిగింది.వెంకటేష్:పి వాసు దర్శకత్వం వహించిన నాగవల్లి చిత్రంలో వెంకటేష్ అఘోర పాత్రలో కనిపించారు.నాగవల్లి చిత్రాన్ని చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కించారు దర్శకుడు.అక్కినేని నాగార్జున:శ్రీనివాస రెడ్డి దర్శకత్వం వహించిన ఢమరుకం చిత్రంలో నాగార్జున కాసేపు అఘోర పాత్రలో కనిపించడం జరిగింది.
ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ శివుడి పాత్రలో నటించారు. ఆర్య:నేను దేవుణ్ణి అనే సినిమాలో ఆర్య కూడా అఘోర పాత్రలో కనిపించటం జరిగింది.ఈ సినిమాలో ఆర్య పాత్ర సినిమాలు ఊహించని స్థాయికి తీసుకెళ్లింది చెప్పచ్చు.విశ్వక్ సేన్:యువ నటుడు అయినా విశ్వక్ సేన్ కూడా అఘోర పాత్రలో నటించే ప్లాన్ లో ఉన్నారు.తన తరువాతి సినిమాలో విశ్వక్ సేన్ అఘోర పాత్రలో కనిపించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి.ఇలా చాల మంది స్టార్ హీరోలు అఘోర పాత్రలలో కనిపించిన అందులో అఖండ చిత్రం ఒక్కటే భారీ విజయం సాధించటం జరిగింది.మిగిలిన హీరోల సినిమాలు అనుకున్నంత విజయం సాధించలేక పోయాయి.ఇలా అఘోర పాత్ర నందమూరి బాలకృష్ణ కు బాగా కలిసివచ్చింది చెప్పచ్చు.