Gold Rate Today: బంగారం కొనడానికి ఇది సరైన సమయమా.. ఈ రోజు తులం ఎంత ఉందంటే

బంగారం ధరలు : Gold Rate Today: భారతీయ మహిళలకు బంగారం అంటే చాలా ఇష్టం. వాళ్లకు కేవలం అది ఒక ఆభరణం మాత్రమే కాదు ఒక సంప్రదాయం, ఆస్తి కూడా. పండుగలు, వివాహాలు ఇలా శుభకార్యం ఏదైనా కూడా మహిళలు ముందుగా…

Gold Rate Today
Gold Rate Today

Gold Rate Today: భారతీయ మహిళలకు బంగారం అంటే చాలా ఇష్టం. వాళ్లకు కేవలం అది ఒక ఆభరణం మాత్రమే కాదు ఒక సంప్రదాయం, ఆస్తి కూడా. పండుగలు, వివాహాలు ఇలా శుభకార్యం ఏదైనా కూడా మహిళలు ముందుగా కనుగలు చేసేది బంగారు ఆభరణాలను. ఆర్థిక కష్టం వచ్చినప్పుడు ఆదుకునే ఆర్థిక భద్రతగా కూడా మన దేశంలో బంగారాన్ని భావిస్తారు. గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే బంగారం కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం అని చాలామంది భావించారు.

ప్రస్తుతం వాళ్లందరికీ ఊహించని షాప్ తగిలింది. మే 30వ తేదీ బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. రెండు రోజుల నుంచి బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. డోనాల్డ్ ట్రంప్ సుంకాల వ్యూహం మళ్లీ పుంజుకోవడంతో మే 30వ తేదీన బంగారం ధరలు మార్కెట్లో పెరిగాయి. గతంలో డోనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల విధింపును ట్రేడ్ కోర్టు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ట్రంప్ ప్రభుత్వం మళ్లీ అప్పిలు చేసుకోగా తాజాగా కోర్టు వాటిని పరిగణలోకి తీసుకొని తీర్పుని నిలిపివేసింది.

దీని ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో మళ్ళీ బంగారం ధరలు పెరిగాయి. ఈ ప్రభావం మన దేశ మార్కెట్లో కూడా కనిపిస్తుంది. జూన్ 1, 2025 హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.89,200, అయితే రెండు రోజుల క్రితం తులం బంగారం పై 250 రూపాయలు పెరిగి ప్రస్తుతం ఈ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.97,310 గా ఉంది. అలాగే హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,10,900 గా ఉంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
Written by

HelloBD Newz