స్టేజి పై తన లవ్ స్టోరీ చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్న నరేష్…ఇంత దారుణంగా మోసం చేసిందంటూ…


బుల్లితెర మీద జబర్దస్త్ కామెడీ షో కు ఉన్న క్రేజ్ గురించి ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రతి గురు,శుక్రవారం ప్రసారం అయ్యే ఈ షో ద్వారా ఎంతో మందికి లైఫ్ దొరికిందని చెప్పచ్చు.ఈ షో నుంచి చాల మంది కమెడియన్స్ వెలుగులోకి వచ్చారు.చాల సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నా ఈ షోలో అప్పటితో పోలిస్తే ఇప్పుడు కామెడీ తగ్గిపోయింది అనే వాదన వినిపిస్తుంది.రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చాల మంది ఇష్టంగా ఈ కామెడీ షో చూస్తారు.ఈ షో తో పాటు ఇతర షోలు కూడా బుల్లితెర మీద ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి.అలాంటి షో లలో శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా ఒకటి అని చెప్పచ్చు.ఇక జబర్దస్త్,ఎక్స్ట్రా జబర్దస్త్,శ్రీదేవి డ్రామా కంపెనీ,ఇలా దాదాపు అన్ని షో లలో కనిపించే నాటి నరేష్ గురించి అందరికి తెలిసే ఉంటుంది.

చూడడానికి చిన్నగా ఉన్న కూడా ఫుల్ కామెడీ తో అందరిని ఆకట్టుకుంటాడు నరేష్.నరేష్ స్కిట్ అంటే ప్రేక్షకులతో పాటు సెట్ లో ఉన్న అందరు కూడా నవ్వుతూనే ఉంటారు.ముందు చలాకి చంటి టీం తో ఎంట్రీ ఇచ్చిన నరేష్ బులెట్ భాస్కర్ టీం తో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు.అయితే నరేష్ వ్యక్తిగత జీవితం గురించి చాల మందికి తెలియదు.ఇటీవలే తన వ్యక్తిగత జీవితం గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్నీ బయటపెట్టాడు నరేష్.వరంగల్ జిల్లాకు చెందిన నరేష్ వయస్సు ఇప్పటికి ఇరవై సంవత్సరాలు పైనే.

కానీ చూడడానికి మాత్రం చిన్నగా కనిపిస్తాడు నరేష్.ఒక ఈవెంట్ లో నరేష్ కు ఒక అమ్మాయి పరిచయం అవ్వడం,రిలేషన్షిప్ లో ఉండడం జరిగిందట.కానీ ఆ అమ్మాయి తనను నిజంగా ప్రేమించలేదని,డబ్బులు కోసం వాడుకొని మోసం చేద్దాం అనుకుందట.అయితే ఈ విషయాన్నీ శ్రీదేవి డ్రామా కంపెనీ లో సాంగ్ కంపోజ్ చేసి మరి చూపించాడు నరేష్.ఇక బ్రేక్ అప్ సాంగ్ గురించి గెస్ట్ సదా అడిగినప్పుడు నిజమేనని చెప్పాడు నరేష్.ఇది నిజంగానే నరేష్ జీవితంలో జరిగిందా లేదా టిఆర్పి కోసం చేసిన స్టెంట అనేది తెలియాలి.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *