Home సినిమా జబర్దస్త్ షో నుంచి మేము వెళ్ళిపోతున్నాము అంటూ స్టేజి పైనుంచి వెళ్ళిపోయినా సుడిగాలి సుధీర్ టీమ్..షాక్...

జబర్దస్త్ షో నుంచి మేము వెళ్ళిపోతున్నాము అంటూ స్టేజి పైనుంచి వెళ్ళిపోయినా సుడిగాలి సుధీర్ టీమ్..షాక్ లో జడ్జి రోజా…

0

బుల్లితెర మీద ప్రసారం అయ్యే జబర్దస్త్ కామెడీ షో కు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసతం లేదు.జబర్దస్త్ కామెడీ షో కు పోటీగా చాల కామెడీ షో లు వచ్చిన కూడా జబర్దస్త్ షో కు ఉన్నంత క్రేజ్ సాధించలేక పోయాయి.జబర్దస్త్ కామెడీ షో చాల మంది టాలెంట్ ను బయటకు తీసి చాల మందికి కమెడియన్లు గా లైఫ్ ఇచ్చింది.ఈ షో లో సుడిగాలి సుధీర్ టీం కు కూడా ప్రత్యేక ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.ఇక ఈ షో నుంచి సుడిగాలి సుధీర్ టీం తప్పుకుంటున్నట్లు చాల రోజుల నుంచి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ టీం లో ఉండే గెటప్ శ్రీను ఆ వార్తలను కొట్టివేసిన సంగతి అందరికి తెలిసిందే.దాంతో ఆ టీం అభిమానులు ఊరట చెందారు.ఎప్పటి లాగానే సుడిగాలి సుధీర్ టీం కామెడీ పండిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

అయితే తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షో కు సంబంధించిన ప్రోమో ఒకటి విడుదల అయ్యి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.సుడిగాలి సుధీర్ టీం ముగ్గురు జబర్దస్త్ కామెడీ షో నుంచి వెళ్ళిపోతున్నట్లు జబర్దస్త్ స్టేజి మీదనే ప్రకటించటం జరిగింది.ప్రోమోలో ముగ్గురు కలిసి చిందులు వేస్తున్నారు.ఆ తర్వాత గెటప్ శ్రీను ఎమోషనల్ గా ముఖం పెట్టి చాల రోజుల నుంచి ముగ్గురం కలిసి,ఇకపై జబర్దస్త్ నుంచి మేము..అంటూ గ్యాప్ ఇచ్చాడు.ఆ తర్వాత రాంప్రసాద్ మాట్లాడుతూ ఈ విషయాన్నీ ఇంటర్వ్యూ పెట్టి చెప్పాలని అనుకున్నాము కానీ స్టేజి మీదనే చెప్పాల్సి వస్తుంది.జబర్దస్త్ నుంచి మేము వెళ్ళిపోవాలి అనుకుంటున్నాము.మమ్మల్ని క్షమించండి,ఇన్ని రోజులు మమ్మల్ని ఇంతలా ఆదరించినందుకు కృతఙ్ఞతలు అంటూ తెలిపాడు.

ఈ ప్రోమో చుసిన నెటిజన్లు మాత్రం ఇది నిజం కాదని కొట్టిపారేస్తున్నాడు.ఒక వేల నిజంగానే వెళ్ళిపోవాలి అని అనుకుంటే సుధీర్ టీం ఇలా చెప్పి వెళ్లే వారు కాదని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.ఇదంతా షోలో ఒక భాగం అని చెప్తున్నారు చాల మంది.ఇదివరకు కూడా జడ్జి నాగబాబు కానీ ఇతర కమెడియన్లు కానీ ఏ ప్రకటన చేయకుండానే వెళ్లి పోవడం జరిగింది.ఒకవేళ నిజంగానే సుడిగాలి సుధీర్ టీం వెళ్ళిపోవాలి అని అనుకున్న కూడా ఎటువంటి ప్రకటన చేయకుండా వెళ్ళిపోతారు అని చాల మంది నెటిజన్లు  కామెంట్స్ చేస్తున్నారు.ఆ ప్రోమో లో ఏం జరిగిందో తెలియాలి అంటే డిసెంబర్ 10 న ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు వేచి చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here