జై భీమ్ సినిమా చూసిన తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రియల్ లైఫ్ సినతల్లి….ఏమందో తెలుసా…!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో గజినీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు హీరో సూర్య.ప్రస్తుతం సూర్య బయోపిక్ సినిమాలు చేయడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నారు.వరుసగా బయోపిక్ సినిమాలు చేస్తూ విజయాలను కూడా అందుకుంటున్నారు సూర్య.అయితే ఇటీవలే తాజాగా సూర్య నటించిన జై భీమ్ అనే సినిమా విడుదల అయ్యి మంచి విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే.రియల్ లైఫ్ లో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించబడిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.గిరిజనులు మరియు దళితులూ ఎలాంటి దారుణమైన పరిస్థితులను ఎదురుకొని తమ జీవనాన్ని సాగించారు అనేది జై భీమ్ చిత్రం లో ప్రేక్షకులకు కళ్ళకు కట్టినట్లు చూపించారు దర్శకుడు.

ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకుల మనసులను బాగా కదిలించింది అని చెప్పాలి.అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయబడిన ఈ చిత్రం ఘానా విజయాన్ని సాధించింది.జై భీమ్ సినిమా ద్వారా హీరో సూర్య విమర్శకుల ప్రశంసలు కూడా అందుకోవడం జరిగింది.అయితే ఈ సినిమా తర్వాత సూర్య రియల్ లైఫ్ సినతల్లి జీవితం సాఫీగా సాగిపోవడానికి కొంత డబ్బు కూడా సహాయం అందించి తన మంచి మనసును చాటుకున్నారు.అయితే ఇటీవలే రియల్ లైఫ్ సినతల్లి సూర్య నటించిన జై భీమ్ సినిమాను చూడడం జరిగింది.

ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సినతల్లి ఈ సినిమాను తన మనవళ్లు ఫోన్లో చూపించారు అని చెప్పడం జరిగింది.కానీ ఈ సినిమాను చివరి వరకు చూడలేదు అని చెప్పింది.ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నా భర్తను కోల్పోయానని,అన్ని కోల్పోయి నిరాశలో ఉన్నానని చెప్పుకొచ్చింది రియల్ లైఫ్ సినతల్లి.అన్ని కోల్పోయాక ఈ సినిమా చూసి ఇంకేం చేయాలి అంటూ చెప్పుకొచ్చింది రియల్ లైఫ్ సినతల్లి.అయితే హీరో సూర్యతో కూడా తానూ సరిగ్గా మాట్లాడలేదని ఆయన ఇచ్చిన డబ్బు మీద వచ్చే వడ్డీతో హాయిగా జీవించాలని ఆయనతో చెప్పినట్లు రియల్ లైఫ్ సినతల్లి చెప్పుకొచ్చింది.రియల్ లైఫ్ లో సినతల్లి పార్వతి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు అందరి మనసులను కలిచి వేస్తుందని చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *