Home సినిమా Jawan Movie: ఇండియన్ సినిమా హిస్టరీ లో అన్ని కోట్లు రాబట్టిన తోలి సినిమా గా...

Jawan Movie: ఇండియన్ సినిమా హిస్టరీ లో అన్ని కోట్లు రాబట్టిన తోలి సినిమా గా రికార్డు క్రియేట్ చేసిన జవాన్

0
Jawan Movie
Jawan Movie

Jawan Movie: దాదాపు నలభై ఏళ్లుగా అన్ని వర్గాల సినిమా ప్రేక్షకులను అలరిస్తూ తన కంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు షారుఖ్ ఖాన్.విలక్షణమైన నటన,విభిన్న సినిమాలకు ప్రాధాన్యం ఇస్తూ ఇండియన్ సినిమాలలో తనదైన ముద్రను వేసుకున్నారు.షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా తో మల్లి ఫారం లోకి వచ్చారు.ఇక పఠాన్ తర్వాత ఫుల్ యాక్షన్ జోనర్ లో వచ్చిన జవాన్ సినిమాతో చరిత్ర సృష్టిస్తున్నారు షారుఖ్ ఖాన్.ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి నాలుగు వారలు అయినా నాలుగవ వారంలో కూడా కలెక్షన్లు పోటెత్తుతున్నాయి.కోలీవుడ్ దర్శకుడు అట్లీ, బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కాంబినేషన్ లో లేటెస్ట్ గా రిలీజ్ అయినా సినిమా జవాన్.

ఈ సినిమాలో నయనతార,విజయ్ సేతుపతి,ప్రియమణి ముఖ్య పాత్రలలో నటించారు.అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ఈ సినిమా లో కీలక పాత్రలో కనిపించారు.అనిరుద్ రవిచందర్ అందించిన సంగీతం ప్రేక్షకులను బాగా కట్టిపడేసింది.ఈ సినిమాలోని పాటలు,బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అన్ని ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.గౌరీ ఖాన్ రెడీ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు.

ఈ సినిమా రిలీజ్ కు ముందే భారీ అంచనాలు క్రియేట్ చేయడం తో రూ.300 కోట్లు థియరిటికల్ బిజినెస్ జరిగింది.ఈ సినిమా ను వరల్డ్ వైడ్ గా 10000 లకు పైగా థియేటర్ లలో రిలీజ్ చేయడం జరిగింది.రిలీజ్ అయినా మొదటి రోజు నుంచే భారీగా రెస్పాన్స్ దక్కించుకున్న ఈ సినిమా మొదటి వారంలో 389 .88 cr ,రెండవ వారంలో 128 cr ,మూడవ వారంలో 55 .92 cr ,ఇక 23 వ రోజు 5 .05 cr ,24 వ రోజు 8 .50 కోట్లు,25 వ రోజు 8 .80 కోట్లు వసూళ్లు సాధించింది.షారుఖ్ ప్రపంచ వ్యాప్తం గా ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని విదేశాల్లో కూడా అత్యధిక స్క్రీన్ లలో ఈ సినిమాను రిలీజ్ చేసారు.ఈ సినిమా విదేశాలలో 25 రోజులకు కలిపి 44 మిలియన్ డల్లర్లు అంటే రూ.366 .11 కోట్లు సాధించి తన సత్తా చాటింది.వరల్డ్ వైడ్ గా 25 రోజులకు రూ.604 .25 కోట్లు నెట్ తో కలిపి రూ.1085 కోట్లు గ్రాస్ కలెక్షన్లు సాధించింది.రూ 600 కోట్లు నెట్ కలెక్షన్స్ మార్కును సాధించిన ఏకైక హిందీ సినిమా గా చరిత్ర సృష్టించింది జవాన్.బాలీవుడ్ చరిత్ర లో అత్యధిక గ్రాస్ సాధించిన సినిమా గా జవాన్ నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here