JR NTR First Movie Remuneration: 18 ఏళ్ళ వయస్సులో హీరో గా ఎన్టీఆర్ మొదటి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా…ఆ డబ్బును ఎన్టీఆర్ ఏం చేసారో తెలుసా…

JR NTR First Movie Remuneration

JR NTR First Movie Remuneration: నందమూరి తారకరామారావు మనవడిగా సినిమా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగు పెట్టిన ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నారు.అతి చిన్న వయస్సులోనే బలరామాయణం సినిమాలో రాముడి పాత్రలో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు.గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జాతీయ అవార్డు కూడా అందుకోవడం జరిగింది.ఆ తర్వాత నిన్ను చూడాలని సినిమాతో 17 ఏళ్ళ వయస్సులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఎన్టీఆర్.2001 లో రిలీజ్ అయినా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Advertisement

అయితే అప్పట్లో ఎన్టీఆర్ ఈ సినిమాకు రూ.4 లక్షలు రెమ్యూనరేషన్ అందుకోవడం జరిగింది.ఇంకా టీనేజ్ వయస్సు కూడా దాటని ఎన్టీఆర్ కు అప్పట్లో ఈ డబ్బు ఏం చేయాలో అర్ధం కాకపోవడంతో తన తల్లి కి ఇచ్చారట.ఈ విషయాన్నీ స్వయంగా ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు.ఇక ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.బాలీవుడ్ సైతం ఎన్టీఆర్ తో సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

JR NTR First Movie Remuneration
JR NTR

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ క్రేజీ ప్రాజెక్ట్ వార్ 2 లో నటిస్తున్నారు.ఈ సినిమా హృతిక్,ఎన్టీఆర్ ముల్టీస్టారర్ గా తెరకెక్కనుంది.మొదటి సినిమాకు కేవలం నాలుగు లక్షలు పారితోషకం తీసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమాకు రూ.100 కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని సమాచారం.కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న సినిమాకు రూ.80 కోట్లు పారితోషకం తీసుకుంటున్నారని తెలుస్తుంది.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *