తెలుగు జాతి ఎంతో ఇష్టంగా గర్వంగా చెప్పుకునే పేరు నందమూరి తారక రామారావు.తెలుగు రాజకీయాలకు,తెలుగు సినిమా ఇండస్ట్రీ కి వన్నె తెచ్చిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారు.తెలుగు ప్రేక్షకులకు సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఆ మహనీయుడు గురించి యెంత చెప్పిన కూడా తక్కువే అవుతుంది.తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఆయన మనవళ్లు చాల మంది వచ్చిన కానీ ఆయన పేరుతో స్టార్ హీరోగా తన నటనతో,డాన్స్ తో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్.సీనియర్ ఎన్టీఆర్ గారి తర్వాత ఆయన వారసత్వాన్ని బాలకృష్ణ నిలబెడితే,ఆ తరువాతి తరంలో జూనియర్ ఎన్టీఆర్ నిలబడేలా చేస్తున్నారు.సీనియర్ ఎన్టీఆర్ గారికి చాల మంది మనవళ్లు ఉన్న కూడా ఆయన నట వారసత్వానికి వన్నె తెచ్చింది మాత్రం తారక్ అని చెప్పచ్చు.సీనియర్ ఎన్టీఆర్ గారు ఎన్నో జానపద,పౌరాణిక,సాంఘిక చిత్రాల్లో నటించి ఆయా పాత్రల్లో జీవించి ఎందరికో స్ఫూర్తినిచ్చారు.
ఆయన పోలికలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతుంది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారే అని తెలుస్తుంది.జూనియర్ ఎన్టీఆర్ సేమ్ తన తాతగారి లాగే ఉండటం నటనలో కూడా ఏ మాత్రం తీసిపోని ప్రతిభ కనపరచటం తో ఆయనకు క్రేజ్ బాగా పెరిగిపోయింది.అయితే సీనియర్ ఎన్టీఆర్ గారికి చాల మంది మనవళ్లు ఉన్న కూడా తారక్ కు ఆయన పేరు ఎలా వచ్చింది..తారక్ కు ఆ పేరు ఎవరు పెట్టారు అనే విషయం చాల మందికి తెలియదు.మే 20 ,1983 లో నందమూరి హరికృష్ణ,షాలిని దంపతులకు జూనియర్ ఎన్టీఆర్ జన్మించారు.తారక్ చైల్డ్ ఆర్టిస్ట్ గా బ్రహ్మర్షి విశ్వామిత్ర,బలరామాయణం వంటి చిత్రాలలో నటించారు.

జూనియర్ ఎన్టీఆర్ 11 ఏళ్ళ వయస్సులో జ్వరంతో బాధపడుతున్న సమయంలో తాతగారు హరికృష్ణ గారి ఇంటికి తన మనవడి బాగోగులు తెలుసుకోవడానికి పంపించారట.హరికృష్ణ గారు తారక్ ను తన తాతగారు ఉంటున్న అబిడ్స్ కు తీసుకువెళ్లారు.అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు నీ పేరేంటి బాబు అని అడిగినప్పుడు…నా పేరు తారక్ రామ్ అని చెప్పారట.అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు ఆ పేరు ఎందుకు పెట్టావ్ అని హరికృష్ణ గారిని ప్రశ్నించారు.అప్పుడు ఆయన అమ్మ పేరు,రాముడి పేరు కలిసి ఉండేలా నా కొడుకులు పేర్లు కళ్యాణ్ రామ్,తారక్ రామ్ అని పెట్టాను నాన్నగారు అని తెలిపారట.అప్పుడు తాతగారు మనవడితో మాట్లాడుతో భవిష్యత్తులో చాల గొప్పవాడివి అవుతావు అని దీవించి,నిది నా అంశ..నా పేరు నీకు ఉండాలి..అంటూ నందమూరి తారక రామారావు అని పేరు పెట్టి దీవించారట.అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ గా ఫేమస్ అయ్యారు.ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా తాత పేరు కలిసి వచ్చేలా తన పిల్లలకు అభయ్ రామ్,భార్గవ్ రామ్ అని పేర్లు పెట్టుకున్నారు.