వరల్డ్ వైడ్ కలెక్షన్లతో రికార్డుల మోత మోగిస్తున్న కె.జి.యఫ్ 2 .ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

కె.జి.యఫ్ మొదటి భాగం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మొదటి భాగాన్ని పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయాలి అని అనుకున్నప్పుడు కన్నడ ఆ స్థాయిలో ఎవరు చూస్తారు అంటూ చాల విమర్శలు తలెత్తాయి.అయితే ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయినా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది.దాంతో కె.జి.యఫ్ రెండవ భాగం మీద ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి.ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కె.జి.యఫ్ 2 ఏప్రిల్ 14 న రిలీజ్ అయ్యి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగానే ఈ మూవీ కి భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.దాంతో మొదటి రోజే ఈ చిత్రం భారీగా కలెక్షన్లను రాబట్టింది.వాటి వివరాలు ఇలా ఉన్నాయి.ఏపీ మరియు తెలంగాణ:19 .05 cr ,కర్ణాటక:17 .00 cr ,తమిళనాడు:4 .50 cr ,కేరళ:3 .40 cr ,హిందీ:26 .00 cr ,ఓవర్సీస్:12 .50 cr ,వరల్డ్ వైడ్:82 .45 cr (షేర్లు).ఈ సినిమాకు థియరిటికల్ బిజినెస్ 350 కోట్లు జరిగింది.ఇక మొదటి రోజు ఈ చిత్రం 82 .45 కోట్లు షేర్లు రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కు రూ.267 .55 కోట్లు షేర్లు రాబట్టవలసి ఉంది.ఈ మూవీ సొంత గడ్డ అయినా కర్ణాటక కంటే కూడా హిందీలో మరియు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా రాబట్టడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *